Koganti Satyam: టీవీ9 చేతిలో కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్.. అందులోని కీలక విషయాలు ఇవే

మిస్టరీ వీడుతోంది.. క్రైమ్ కథపై క్లారిటీ వస్తుంది. రాహుల్ హత్య కేసులో పోలీసులు నిందితుల నుంచి నిజాలు రాబడుతున్నారు.  కోగంటి సత్యం రిమాండ్‌ రిపోర్ట్ టీవీ9 చేతికి అందింది.

Koganti Satyam: టీవీ9 చేతిలో కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్.. అందులోని కీలక విషయాలు ఇవే
Koganti Satyam
Follow us

|

Updated on: Aug 25, 2021 | 8:31 AM

మిస్టరీ వీడుతోంది.. క్రైమ్ కథపై క్లారిటీ వస్తుంది. రాహుల్ హత్య కేసులో పోలీసులు నిందితుల నుంచి నిజాలు రాబడుతున్నారు.  కోగంటి సత్యం రిమాండ్‌ రిపోర్ట్ టీవీ9 చేతికి అందింది.  రాహుల్‌ హత్యకేసులో 9 మంది సాక్షులను విచారించారు పోలీసులు. కోగంటి సత్యంపై గతంలో 24 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కోరాడ విజయ్‌తో కలిసి రాహుల్‌ హత్యకు  కోగంటి సత్యం కుట్ర పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జిక్సిన్ కంపెనీలో వాటాలు వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. కంపెనీలో రాహుల్‌కు 40 శాతం, విజయ్‌కు 30 శాతం షేర్లు, రాహుల్‌ చౌదరికి 20 శాతం, స్వామికిరణ్‌కు 10 శాతం షేర్లు ఉన్నాయి.  ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం తలెత్తినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. రాహుల్ హత్య కేసులో నిందితుడు కోగంటిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను మచిలీపట్నం జైలుకు తరలించారు.

కాగా ఈ నెల 23న కోగంటి సత్యం బెంగుళూరుకు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అలర్టైన పోలీసులు.. మెయిల్ ద్వారా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏపీ పోలీసుల‌ సమాచారంతో ఎయిర్ పోర్ట్‌లో కోగంటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి స్పెషల్ టీమ్ బెంగళూరుకి వెళ్లింది. పొరిజిన్ పాస్ పోర్ట్తో పాటు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అతడిని విజయవాడ తరలించారు. రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను A4 నిందితుడిగా  పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.

కోగంటి కేరాఫ్ క్రైమ్

కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం. కన్నింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. బెజవాడలో సత్యం గారిదొడ్డి అంటే అక్రమాలకు అడ్డా.. ఎన్నో నేరాలు, మరెన్నో హత్యలు.. అంతకుమించి మోసాలు. ఇదీ స్థూలంగా కోగంటి సత్యం చరిత్ర.  స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. తాజాగా బిజినెస్‌మాన్ రాహుల్ హత్యలోనూ అతడికి సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అతడి నేర చరిత్ర ఒక్కసారి తిరగేస్తే.. కోగంటి సత్యం తొలినాళ్లలో పాత సీసాలు ఏరుకొనే వాళ్ల దగ్గర నుంచి సీసాలు కొని అమ్ముకునేవాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో ఎన్నో నేరాలు చేశాడు. రౌడీషీటర్ ముద్ర పోగొట్టుకునేందుకు పారిశ్రామికవేత్త అవతారం ఎత్తాడు. కష్టపడి పైకొచ్చిన వాళ్లు ఒక రకం.. మోసం చేసి పైకొచ్చిన వాళ్లు రెండో రకం. కానీ, కోగంటి సత్యం ఈ రెండూ కాదు. అతడు మూడో రకం… అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ, అడ్డు తొలగించుకుంటూ పైకొచ్చిన రకం.. పాత సీసాలు కొని అమ్ముకునే కోగంటి సత్యం.. అదే కోవలో ఐరన్ స్క్రాప్‌ను కూడా కొని అమ్మడం ప్రారంభించాడు. విజయవాడలో రైల్వే వ్యాగన్స్ వద్ద కొద్దికొద్దిగా ఇనుము దొంగతనాలు చేసే వారి దగ్గర్నుంచి ఐరన్ కొనడం మొదలుపెట్టాడు. అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరించాడు. వాస్తవానికి కోగంటి సత్యం స్వస్థలం బెజవాడ కాదు. అతడి తండ్రి కోగంటి రామయ్య గుంటూరు జిల్లా ఎడ్లపల్లి నుంచి వ్యాపార నిమిత్తం విజయవాడ వలస వచ్చారు. మంగళగిరిలో స్క్రాప్ దుకాణం నిర్వహించేవారు. కోగంటి సత్యం తల్లిది నిజామాబాద్ జిల్లా బాన్సువాడ.

నేర చరిత్రకు బీజం అక్కడే..

కోగంటి సత్యం రౌడీయిజానికి మంగళగిరిలోనే బీజం పడింది. 1984-85లో నాటి మంగళగిరి సర్పంచ్‌పై తొలిసారి కోగంటి సత్యం, అతడి అనుచరులు హత్యాయత్నం చేశారు. తాడేపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో సర్పంచ్‌పై దాడి చేసి అతడు మరణించాడని కృష్ణానదిలోకి విసిరేశారు. అయితే.. అతడు అప్పటికప్పుడే మరణించకపోయినా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. ఆ కేసులోనే తొలిసారిగా కోగంటి సత్యంపై మర్డర్ కేసు నమోదైంది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి కృష్ణలంక తన మకాం మార్చాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

నేరాలు ఇచ్చిన ధీమాతో కాబోలు.. ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేస్తూనే కోగంటి సత్యం మెల్లమెల్లగా భూకబ్జాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. అలా సెటిల్మెంట్లు చేసిన డబ్బుతో కొండపల్లిలో ఎస్.డి.వి. స్టీల్స్ ప్రారంభించాడు. ఇదే సమయంలో వరసగా నేరాలు చేస్తూ పోయాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బిషప్ భగవాన్‌దాస్ హత్య కేసులోనూ కోగంటి సత్యమే ప్రధాన నిందితుడు. 1988 మార్చి 12న గాంధీనగర్ ఊర్వసి థియేటర్ దగ్గర నేతల భగవాన్ దాసును కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. డోర్నకల్ రోడ్డులోని 2,400 గజాల స్థలాన్ని భగవాన్ దాస్ నుంచి కోగంటి సత్యం కొనుగోలు చేశారని.. నగదు తీసుకున్న భగవాన్ దాస్ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతోనే కోగంటి సత్యం ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.రంగా హత్య తర్వాత మరింత రెచ్చిపోయాడు కోగంటి.  తనకు కోగంటి సత్యం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నేతల భగవాన్ దాస్ కోరినప్పటికీ సీపీ నాయక్.. గన్‌మెన్లను ఇవ్వకుండా కోగంటి సత్యంకు సహకరించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిగా కోగంటి సత్యం బందర్ రోడ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే లీలామహల్‌ను సీపీకి గిఫ్ట్‌గా ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. 1988లో విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ హయాంలో కోగంటి సత్యంపై రౌడీషీట్ ఓపెన్ చేసారు. అదే సంవత్సరం వంగవీటి రంగా హత్య జరిగింది. రంగా హత్యానంతరం ఆయన అనుచరులు అందరినీ కోగంటి సత్యం చేరదీశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు.

సినీ నటి వహీదాను వదలని కోగంటి..

సినీ నటి వహీదా రెహ్మాన్‌కు చెందిన భూమి కబ్జా విషయంలోనూ కోగంటిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై వహీదా విజయవాడలో కేసు పెట్టారు. బెంజి సర్కిల్ వద్ద ఉన్న వహీదాకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూమి నేటికీ కోగంటి సత్యం కబంధ హస్తాల్లోనే ఉందని చెబుతారు.

కోగంటి ప్లాన్ చేస్తే ఇక అంతే.. బయటపడ్డది ఆ ఒక్కరే

కోగంటి సత్యం మర్డర్ ప్లాన్ చేస్తే ఇక అంతేనని జనం టాక్. కోగంటి కుట్ర నుంచి బతికి బయటపడ్డది ఒక్క కాట్రగడ్డ బాబు మాత్రమేనని చెబుతారు. 2008లో కాట్రగడ్డ బాబుపై కోగంటి సత్యం సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు జరిపించాడని ఓ కేసు నమోదైంది. కాట్రగడ్డ బాబు, కోగంటి సత్యం ఇద్దరూ కలిసి కొద్దిరోజుల పాటు విజయవాడలో వ్యాపారం నిర్వహించారు. దీంతోపాటు భూకబ్జాలకు పాల్పడ్డారు. వాటాల్లో తేడాలు రావడంతో కాట్రగడ్డ బాబుపై కోగంటి దాడి చేసినట్లు తొలుత భావించారు. కానీ, ఇందులోనూ ట్విస్టు బయటపడింది.

వాస్తవానికి కాట్రగడ్డ బాబు తండ్రి వెంకటనారాయణ హత్య కేసులో వంగవీటి శంతన్‌కు కోగంటి సత్యం సాయం చేశాడని ఆరోపణ. కాట్రగడ్డ బాబుకు సోదరుడి వరుసైన ముసునూరు శ్రీను 2006లోనే కోగంటి సత్యంపై దాడి చేయించాడని చెబుతారు. ఐదో నెంబర్ రోడ్‌లో సీఎంఎస్ చర్చ్ కాంపౌండ్‌లో కోగంటి సత్యం మంచినీళ్లు తాగుతుండగా.. ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి స్నైపర్ గన్‌తో కాల్పులు జరిగాయి. కానీ, కోగంటి తప్పించుకున్నాడు.

బందర్ రోడ్‌లో ఉన్న శేషసాయి కళ్యాణ మండపంలో ఓ ఫంక్షన్ సందర్భంగా కోగంటి సత్యంపై మరోసారి దాడి జరిగింది. కళ్లల్లో కారంచల్లి దాడికి పాల్పడటానికి ప్రయత్నించగా.. అది కూడా మిస్ అయింది. ఆ తర్వాత కోగంటి సత్యం, వంగవీటి శంతన్ ఓ కేసులో కోర్టుకు హాజరై వస్తుండగా కాల్పులు జరిగాయి. కోగంటి సత్యం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక కాట్రగడ్డ బాబు నుంచి వరస దాడులతో.. కోగంటి సత్యం అతడిపైనే కాల్పులు జరిపించాడని అప్పట్లో ఓ కేసు నమోదైంది.2010లో దుర్గ కళామందిర్ వద్ద కొంత స్థలాన్ని కబ్జా చేశాడనే అంశంపై కోగంటి సత్యంపై కోకా యాక్ట్ కింద కేసు నమోదైంది. నాటి విజయవాడ పోలీస్ కమిషనర్‌ సురేంద్ర బాబు కొద్ది రోజుల పాటు కోగంటిపై నగర బహిష్కరణ వేటు కూడా వేశారు. ఆ తర్వాత దిండి గణేశ్ మండపం వ్యవహారంలో బోండా ఉమా, కోగంటి సత్యం మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదాల్లో కోగంటి సత్యంపై కేసు నమోదైంది.

ఇలా కోగంటి సత్యంపై ఒక్క విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25 కేసుల వరకు ఉన్నాయి. తాజాగా బిజినెస్‌మాన్ రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం చేసిన కుట్రలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: ఓవైపు కరోనా, మరోవైపు వైరల్ ఫీవర్స్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్

అమెరికాలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్స్‌కి ఎక్కిన ఇగోర్ మృతి

Latest Articles
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.