AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు.. కారణమేంటంటే..

Hyderabad: మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటి వద్ద జరిగిన వ్యవహారంపై

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు.. కారణమేంటంటే..
Mynampally
Shiva Prajapati
|

Updated on: Aug 24, 2021 | 9:50 PM

Share

Hyderabad: మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. దూలపల్లిలోని మైనంపల్లి ఇంటి వద్ద జరిగిన వ్యవహారంపై పేట్ బషీర్‌బాద్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈనెల 17వ తేదీన మైనంపల్లి హనుమంతరావు ఇంటికి వెళ్లిన తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ బీజేపీకి చెందిన కొందరు దళిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్‌పై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన బీజేపీకి చెందిన పలువు దళిత మహిళలు నేరుగా మైనంపల్లి ఇంటికి వెళ్లారు. బండి సంజయ్ పట్ల చేసిన వ్యాఖ్యలపై నిలదీశారు. ఆ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంతరావు తనను లోపలికి తీసుకెళ్లి రేప్ చేయబోయాడంటూ జజల రమ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరికొందరు మహిళలు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీర్‌బాద్ పోలీసులు.. మైనంపల్లిపై 354, SEC3(1) (s) SC/ST(POA) act 1989 కింద కేసులు నమోదు చేశారు.

Also read:

వంటల్లో గ్రేవీ చిక్కగా రావడం లేదా ? ఇలా చేస్తే.. రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది.. అవెంటంటే..

BIG NEWS-BIG DEBATE: కులమతాల లెక్కలు.. రాజకీయ ఆటలు.. సంక్షేమం కోసమా? ఓటుబ్యాంకు రాజకీయమా?..

పోస్టాఫీస్‌లో లక్కీ స్కీమ్‌.. భారీ వడ్డీ…!పూర్తి వివరాలు ఈ వీడియోలో ..:Lucky Scheme in Post Office Video.