BIG NEWS-BIG DEBATE: కులమతాల లెక్కలు.. రాజకీయ ఆటలు.. సంక్షేమం కోసమా? ఓటుబ్యాంకు రాజకీయమా?..
BIG NEWS-BIG DEBATE: సార్వత్రిక ఎన్నికల టైం దగ్గర పడుతోంది. అంతకంటే ముందు ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పార్టీలన్నీ కులమతాలపై ఫోకస్ పెట్టాయి.
BIG NEWS-BIG DEBATE: సార్వత్రిక ఎన్నికల టైం దగ్గర పడుతోంది. అంతకంటే ముందు ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పార్టీలన్నీ కులమతాలపై ఫోకస్ పెట్టాయి. జనాభా లెక్కల్లో కులాల ప్రస్తావన ఉండదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాలమ్స్ మాత్రమే ఉంటాయి. ఈ సారి క్యాస్ట్ ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు నాయకులు. బీసీ లే ఎందుకు దీనిని బలంగా కోరుకుంటున్నారు. నష్టపోతున్నామన్న అభిప్రాయం వెనకబడిన వర్గాల్లో ఉందా? ప్రధాని మోదీని కలిసి మరీ కులాల లెక్కలు తీయాలని విజ్ఞప్తి చేయడం ద్వారా దేశ రాజకీయాలను కులాలు శాసించబోతున్నాయా. నిజంగా సంక్షేమం కోసం లీడర్లు చేస్తున్న ప్రయత్నమా? ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగమా?
నిన్నమొన్నటి దాకా బద్ద శత్రువులుగా ఉండి పోట్లాడుకున్న నాయకులు కూడా ఇప్పుడు భుజం భుజం రాసుకుని మరీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో రాయభారం నెరుపుతున్నారు. అర్జెంటుగా దేశంలో కులాల లెక్కలు తీయాల్సిందే అంటూ స్వరం పెంచారు. మోదీ ఆన్సరేంటో బయటకు అధికారికంగా చెప్పలేదు కానీ.. దీనిని వ్యతిరేకించలేదని మిత్రపక్ష నాయకుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ క్లారిటీ ఇస్తున్నారు. బీసీ యోధులుగా.. ఆ వర్గాల అండదండలతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీశ్, లాలూ వారసులు అంతా కూడా ఇప్పుడు మరోసారి బీసీ మంత్రం జపిస్తున్నారు. అసలే దేశంలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారు. వాళ్లలో బీసీ కులాలెన్ని.. వాళ్ల జనాభా ఎంత అంటూ లెక్కల గురించి అడుగుతున్నారు. తెలిస్తేనే వారికి సంక్షేమ పథకాలు అందించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. మరి ఈ నేతల పట్టు సంక్షేమం కోసమేనా? లేక మరేదైనా లోగుట్టు ఉందా?
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..