VHP slams AIMIM : ఎంఐఎం ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందన్న వీహెచ్‌పీ, బైంసాలో హిందువుల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపాటు
VHP slams AIMIM : ఎంఐఎం ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది వీహెచ్‌పీ. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు.. బైంసాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని..
VHP slams AIMIM : ఎంఐఎం ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది వీహెచ్‌పీ. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు.. బైంసాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తున్నారని మండిపడింది. భైంసా ఘటనపై NIAతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు యూపీ తరహాలో చట్టాలు తీసుకురావాలని సూచించింది. మిస్సింగ్ కేసులపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా, భైంసా ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 144 సెక్షన్‌తో అన్ని బంద్ కావడంతో.. నిత్యావసరాల కోసం ఉసూరుమంటున్నారు. కనీసం పాలు, నీళ్లు కూడా దొరక్క అల్లాడుతున్నారు. అల్లర్ల కారణంగా వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడడంతో.. బైంసా పట్టణం మూగబోయింది.
గురువారం రాత్రి మరోసారి కొందరు దుండగులు.. ఓ హోటల్, రెండు ఆటోలకు నిప్పు పెట్టడంతో.. ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. మరోవైపు, భైంసాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. మహాగావ్, పహాడీలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అల్లర్లు దురదృష్టకరమన్న మంత్రి ఇంద్రకరణ్.. శాశ్వత పరిష్కారంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అల్లర్ల వెనుక ఎవరున్న వదిలిపెట్టేది లేదన్న మంత్రి.. రాజకీయ కోణంలో వాడుకోవాలనుకునే వారికి ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు.