SELFIE DEATH: రైలు పట్టాలపై సెల్ఫీలు.. ఢీ కొట్టిన రైలు.. ఇద్దరు యువకుల దుర్మరణం

సెల్ఫీ మోజు కొన్ని సార్లు ప్రాణాలనూ హరిస్తోంది. స్వీయ చిత్రం తీసుకోవాలన్న ఆరాటంలో కొందరు యువకులు వెనుకాముందూ ఆలోచించకుండా ప్రవరిస్తున్నారు. ఇలా చేస్తే పక్కనున్న వారిని, తమకు హాని కలుగుతోందా అనే విషయాన్నీ పట్టించుకోవడం లేదు....

SELFIE DEATH: రైలు పట్టాలపై సెల్ఫీలు.. ఢీ కొట్టిన రైలు.. ఇద్దరు యువకుల దుర్మరణం
Selfie Train
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 07, 2022 | 9:03 AM

సెల్ఫీ మోజు కొన్ని సార్లు ప్రాణాలనూ హరిస్తోంది. స్వీయ చిత్రం తీసుకోవాలన్న ఆరాటంలో కొందరు యువకులు వెనుకాముందూ ఆలోచించకుండా ప్రవరిస్తున్నారు. ఇలా చేస్తే పక్కనున్న వారిని, తమకు హాని కలుగుతోందా అనే విషయాన్నీ పట్టించుకోవడం లేదు. సెల్ ఫోన్ కెమెరా మీద ధ్యాస పెట్టి చుట్టూ ఏం జరుగుతోందని గమనించకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో సెల్ఫీలు, ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ సమయం వ‌ృథా చేయడమే కాకుండా అప్పుడప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో రైలు పట్టాలపై సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.

మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలోని మచనా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే వంతెనపై సెల్ఫీలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ముఖేష్ ఉయికే, మనీల్ మార్స్కోల్ వివాహ వేడుకకు వెళ్లేందుకు ఇంటినుంచి బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే వంతెనపై స్వీయచిత్రం తీసుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన భాగమతి రైలు.. సెల్ఫీలు తీసుకుంటున్న యువకులను ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!