Hyderabad: కూలీల ప్రాణం తీసిన సెప్టిక్ ట్యాంక్.. శుభ్రం చేస్తూ ఇద్దరు దుర్మరణం..
Septic Tank Cleaners Dead: సెప్టిక్ ట్యాంక్‌లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సఫాయి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా సెఫ్టిక్ ట్యాంకును
Septic Tank Cleaners Dead: సెప్టిక్ ట్యాంక్‌లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సఫాయి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా సెఫ్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తూ.. ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానవీయమైన ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గచ్చిబౌలి మసీదుబండలోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు.. ఇద్దరు కూలీలు ఆదివారం ఉదయం దిగారు. దిగిన కాసేపటికే ఊపిరాడకపోవడంతో ఇద్దరూ అందులోనే మరణించారు. విష వాయువులు పీల్చడంతో అందులోనే కూప్పకూలి చనిపోయారని పోలీసులు పేర్కొంటున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇద్దరు కూలీల మృతదేహాల్ని బయటకు తీశారు. మృతులు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసముంటున్నారని పేర్కొ్నారు. వారి స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ అని తెలిపారు. ఈ మేరకు పోలీసులు మృతల బంధువులకు సమాచారం చేరవేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: