Crime News: ఉన్మాది బీభత్సం.. ఇనుప రాడ్డుతో కొట్టి ఎస్ఐ సహా ఐదుగురి హత్య..
Tripura man arrested for killing 5: మానసిక ఇబ్బందుల్లో కురుకుపోయిన ఓ ఉన్మాది భీభత్సం సృష్టించాడు. ఇనుప రాడ్డుతో తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా
Tripura man arrested for killing 5: మానసిక ఇబ్బందుల్లో కురుకుపోయిన ఓ ఉన్మాది భీభత్సం సృష్టించాడు. ఇనుప రాడ్డుతో తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా ఐదుగురిని హత్యచేశాడు. ఈ ఘటన త్రిపురలోని ఖొవాయ్ జిల్లాలో కలకలం రేపింది. ఖొవాయ్ జిల్లాలోని ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్ దేవ్‌రాయ్ (40) శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఉన్మాదిగా మారాడు. తన ఇంట్లోనే భార్య, ఇద్దరు కూతుళ్లపై ఇనుప రాడ్‌తో దాడిచేశాడు. అనంతరం సోదరుడిని ఐరన్ రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో కూతుళ్లు, సోదరుడు మరణించినట్లే పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఆటోను అడ్డగించి, డ్రైవర్, అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.
వెంటనే సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సత్యజిత్ మల్లిక్ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దేవ్‌రాయ్ ప్రదీప్‌ను నిలువరించేందుకు వారంతా యత్నించారు. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ప్రదీప్.. ఇన్‌స్పెక్టర్ సత్యజిత్‌పై కూడా ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు అగర్తల ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఎస్ఐ చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం అతడి భార్య, ఆటోడ్రైవర్ కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం ప్రదీప్ దేవ్‌రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపర్చారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర గానీ, మానసిక సమస్యలు గానీ లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఖొవాయ్ పోలీసులు వెల్లడించారు.
Also Read: