JK Encounter: జమ్ముకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు తీవ్రవాదుల హతం..
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరుగుతున్న భీకర ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపారు. అలెర్ట్ అయిన బలగాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసలుు తెలిపారు.
#UPDATE | Two unidentified terrorists neutralized in the encounter that broke out between security forces and terrorists in the Chowgam area of Shopian. Incriminating materials including arms & ammunition recovered. The search operation is underway: Kashmir Zone Police pic.twitter.com/fphCiEXP3f
— ANI (@ANI) December 25, 2021
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారని.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా.. నిన్న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Also Read: