AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యపై పీఎస్‌లో ఫిర్యాదు.. కట్‌చేస్తే.. భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య!

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బీబీనగర్ శివారులోని రిసార్ట్స్‌లో ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు వివాహేతర సంబంధం అంటగట్టారనే కారణంతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యపై పీఎస్‌లో ఫిర్యాదు.. కట్‌చేస్తే.. భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య!
Yadadri News
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 30, 2025 | 1:15 PM

Share

వరుసకు బావమరదలు అయిన ఓ జంట వివాహేతర సంబంధం పెట్టుకొని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్‌కు చెందిన బంధబాల సుధాకర్, రామంతాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన సుష్మిత అనే మహిళ వరుసకు బావమరదలు అవుతారు. అయితే ఇద్దరికీ కొన్నాళ్ల క్రితం వేర్వేరుగా వివాహాలు జరిగాయి. కానీ వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం పెళ్లిళ్లు అయినా కూడా తగ్గలేదు. పెళ్లైన తర్వాత కూడా వీరు మాట్లాడుకోవడం, కలవడం వంటికి జరుగుతున్న పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరు సన్నిహితంగా ఉండడంతో వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని రెండు కుటుంబాల్లో అనుమానం మొదలైంది. ఇదే విషయంపై తరచూ గొడవలు కూడా జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో భార్య సుష్మిత తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆమె భర్త నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పీఎస్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత బావ సుధాకర్ వద్దకు వెళ్లిపోయింది. ఇక వీరు ఇద్దరు గత రెండు రోజులుగా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్స్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తమకు వివాహేతర సంబంధం అంటకట్టారని మనస్తాపానికి గురైన ఇద్దరు కలిసి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే సుధాకర్ తాము చనిపోవాలనుకున్న విషయాన్ని తన బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ, తాము ఎక్కడున్నాము అనేది మాత్రం చెప్పలేదు. దీంతో కంగారు పడిపోయిన రంజిత్ వెంటనే ఉప్పల్ పోలీసుల ఫిర్యాదు చేశాడు. వారు బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సుధాకర్ మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వారు ఉన్న లోకేషన్‌ను గుర్తించిన పోలీసులు కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు పోలీసులు చేరుకున్నారు.

వారు ఉంటున్న గది నెంబర్ తెలుసుకొని అక్కడికి వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా, రూమ్‌లోని బెడ్‌పై సుధాకర్, సుష్మితలు విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..