Road Accident: వివాహ వేడుకకు హాజరై వస్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి
Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో, టిప్పర్ ఢికొన్న సంఘటనలో
Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో, టిప్పర్ ఢికొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల మండలం జోలదరాసి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జోలదరాసి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన ఓ కుటుంబం తిరిగి ఇంటికి వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న టిప్పర్.. స్కార్పియో వాహనాన్ని ఢికొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతులు కొండపల్లి శ్రీనివాస రెడ్డి, రాంపురం మధుసూదన్ రెడ్డి గా గుర్తించారు. వీరంతా జోలదరాసి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని.. చికిత్స అందుతుందని కోవెలకుంట్ల పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు.
Also Read: