Hyderabad: ప్రాణం తీసిన వేగం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు దుర్మరణం..

కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్ (22) ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో సోమాజిగూడ హనుమాన్‌ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీకొట్టారు.

Hyderabad: ప్రాణం తీసిన వేగం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు దుర్మరణం..
Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 15, 2022 | 10:30 AM

Road Accident in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతి వేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్ (22) ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో వేగంగా వేళ్తూ సోమాజిగూడ హనుమాన్‌ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని వారు వచ్చిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..