Andhra Pradesh: విషాదం మిగిల్చిన వర్షం.. గోడ కూలి ఇద్దరి మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

Vizianagaram: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు గరివిడి మండలం కుమరాంలో శనివారం తెల్లవారుజాము పెంకుటిల్లు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Andhra Pradesh: విషాదం మిగిల్చిన వర్షం.. గోడ కూలి ఇద్దరి మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..
Ap Rains
Follow us
Basha Shek

|

Updated on: Jul 09, 2022 | 12:05 PM

Vizianagaram: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు గరివిడి మండలం కుమరాంలో శనివారం తెల్లవారుజాము పెంకుటిల్లు గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పెంకుటిల్లు గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతోన్న అడ్డాల లక్ష్మి(47), అడ్డాల అశోక్‌కుమార్‌ రాజు(5) అక్కడికక్కడే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గరివిడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన మరో ముగ్గురిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా భారీ వర్షాలకు ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

నల్గొండలోనూ

ఇక  నిన్న తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.  వర్షం కారణంగా గోడకూలి తల్లి, కూతురు మృతి చెందారు . భారీగా కురిసిన వర్షానికి రాత్రి సమయంలో నిద్ర పోతూ ఉండగా  గోడ కూలి వారిపై పడడంతో నిద్రలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన నడిపూరి లక్ష్మి (47), ఆమె కుమార్తె కల్యాణి (21)గా గుర్తించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల గమనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతాయి. రహదారులు దెబ్బతినడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..