Train Accident: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి.. న్యాయ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

Train Accident: ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. హరిద్వార్ లో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. గురువారం రాత్రి డబుల్ ట్రాక్ ట్రయల్స్ సమయంలో....

  • Subhash Goud
  • Publish Date - 1:23 am, Fri, 8 January 21
Train Accident: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి.. న్యాయ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి

Train Accident: ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. హరిద్వార్ లో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. గురువారం రాత్రి డబుల్ ట్రాక్ ట్రయల్స్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో న్యాయ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రమాదంలో మరి కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ రైలు గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.