AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో దారుణం..టిక్‌టాక్‌ వ్యసనానికి యువతి బలి

టిక్​టాక్​ వ్యసనం నిత్యం ఏదో ఒక చోట చిచ్చుపెడుతూనే ఉంది. ఎవరో కొందరికి మాత్రం టాలెంట్​ను బయటపెట్టుకునేందుకు టిక్​టాక్​ పనికొస్తుండగా.. చాలా మందికి సమస్యగా మారుతోంది.

హైదరాబాద్‌లో దారుణం..టిక్‌టాక్‌ వ్యసనానికి యువతి బలి
Jyothi Gadda
|

Updated on: May 29, 2020 | 10:37 AM

Share

టిక్​టాక్​ వ్యసనం నిత్యం ఏదో ఒక చోట చిచ్చుపెడుతూనే ఉంది. ఎవరో కొందరికి మాత్రం టాలెంట్​ను బయటపెట్టుకునేందుకు టిక్​టాక్​ పనికొస్తుండగా.. చాలా మందికి సమస్యగా మారుతోంది. స్టూడెంట్ల చదువును దెబ్బతిస్తోంది. ఉద్యోగాలను ఊడగొడుతోంది. కుటుంబాల్లో గొడవలకు దారితీస్తోంది. చివరికి విడాకులకు, హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతోంది. తమకు ఎక్కువగా లైక్ లు, వ్యూస్​ రావడం లేదన్న ఆవేదన డిప్రెషన్​కు దారితీసి కొందరిని ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. ఇప్పటికే దాని ప్రభావంతో చాలా మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడగా,.. ఇప్పుడు మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ఎప్పుడూ టిక్‌టాక్‌తోనే సమయం గడిపేయడంతో మందలించినందుకు సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్‌లోని రామంతాపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(17)ఫోన్‌లో టిక్‌టాక్‌లు చేస్తూ.. చూస్తూ ఎక్కువ సమయం గడిపేస్తోంది. ఎప్పుడూ ఫోన్‌లోనే ఆటలు ఆడుతూ ఉంటోంది. అది గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి గురువారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే, టిక్‌‌టాక్‌‌ యాప్​ వాడకం పెరిగినప్పటి నుంచీ వివాదాలు పెరిగిపోతున్నాయి. దాని మోజు వికటించి దుష్పరిణామాలకు దారితీస్తోంది. అశ్లీల చిత్రాలు, మతపరమైన ఉద్రిక్తతలు, హింసను ప్రేరేపించేలా కొందరు వీడియోలు రూపొందించడం గొడవలకు కారణమవుతోంది. దాంతో యాప్‌‌ను నిలిపివేయాలని టిక్‌‌టాక్‌‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. కానీ ఆ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ టిక్‌‌టాక్ అందుబాటులోకి వచ్చింది. టిక్‌టాక్ వల్ల జరుగుతున్న అనర్థాలు రోజూ ఎక్కడో ఓ చోట బయటికి వస్తూనే ఉన్నాయి. లైక్​లు, వ్యూస్​ కోసం ఎలా పడితే అలా డ్రెస్సింగ్ చేసుకొని వీడియోలు తీయడం పరువు తీస్తోంది. అడ్డగోలు సాహసాలకు పాల్పడుతున్నవారి ప్రాణాలు పోతున్నాయి.