బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం..లేడీ డాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి సీబీసీఐడీ

నిందితుడిని విచారిస్తున్న సమయంలోనే ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం అతడిపై ఫిర్యాదు చేసినట్లుగా అక్కడి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, నిందితుడిపై వస్తున్న కేసుల సంఖ్య ప్రస్తుతం కుమరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తుండటంతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు.

బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యవహారం..లేడీ డాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి సీబీసీఐడీ
Follow us

|

Updated on: May 29, 2020 | 1:21 PM

అతడి కంటపడిన ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. తెలిసిన వాళ్ల దగ్గర నుంచి అందరిపై తన మాయాజాలం ప్రదర్శిస్తాడు. మంచివాడిలా నటించి ఫోన్ నెంబర్ సేకరిస్తాడు. ఆ తర్వాత ప్రేమగా మాటలు కలుపుతాడు. అమాయక యువతుల్ని మాయమాటలతో లొంగదీసుకుని, వీడియోలు తీస్తాడు. ఇక అప్పుడు తన విశ్వరూపం చూపిస్తాడు. వ్యక్తిగత ప్రైవేట్ చిత్రాలు సేకరించి వాటి ద్వారా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతూ, అందింది దోచుకుంటూ వచ్చిన కన్యాకుమారికి చెందిన ఓ యువకుడి కేసు సీబీసీఐడీకి చేరింది. సదరు కేటుగాడిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండడంతో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు పరిశీలించగా…

చెన్నైకు చెందిన మహిళా డాక్టరు ఒకరు గత నెల ఇచ్చిన ఫిర్యాదుతో కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ కేంద్రంగా ఓ 26ఏళ్ల యువకుడు సాగిస్తూ వచ్చిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా యువతులు, సంపన్న మహిళలే టార్గెట్‌గా వారితో సన్నిహితం పెంచుకుని, లొంగ దీసుకోవడమే కాదు, వీడియో చిత్రీకరించి బ్లాక్‌ మెయిలింగ్‌ తో సొమ్ము చేసుకుంటూ వచ్చిన యువకుడ్ని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతగాడ్ని గూండా చట్టం కింద అరెస్టు చేసి విచారించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, పెన్‌ డ్రైవ్‌లో పదుల సంఖ్యలో యువతులతో గడిపిన వీడియోలు బయట పడ్డాయి. రెండు సార్లు ఇతడ్ని కస్టడికి తీసుకుని విచారించారు.

ఈ సమయంలోనే ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం అతడిపై ఫిర్యాదు చేసినట్లుగా అక్కడి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, నిందితుడిపై వస్తున్న కేసుల సంఖ్య ప్రస్తుతం కన్యాకుమారికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తుండటంతో కేసును సీబీసీఐడీకి అప్పగించినట్లు కుమరి జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌ డీజీపీ త్రిపాఠి వివరించారు. ఈ కేసులో నిందితుడికి అనుచరుడిగా ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకడు విదేశాల్లో ఉన్నాడని, అతడు తప్పించుకోకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినట్టు వివరించారు. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..