రామ మందిర నిర్మాణంపై విషం చిమ్ముతున్న పాక్‌

అయోధ్యలో శ్రీరామచంద్రుడి కోసం భవ్య్‌ రామ్‌ మందిర్‌ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా మందిర నిర్మాణంపై సందిగ్ధత నెలకొనగా.. గతేడాది నవంబర్‌ మాసంలో సుప్రీంకోర్ట్.. బాబ్రీ- రామ మందిర విషయంపై తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్‌లల్లాకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే అదే సమయంలో మసీదు నిర్మాణం కోసం.. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో రామ […]

రామ మందిర నిర్మాణంపై విషం చిమ్ముతున్న పాక్‌
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 3:24 PM

అయోధ్యలో శ్రీరామచంద్రుడి కోసం భవ్య్‌ రామ్‌ మందిర్‌ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా మందిర నిర్మాణంపై సందిగ్ధత నెలకొనగా.. గతేడాది నవంబర్‌ మాసంలో సుప్రీంకోర్ట్.. బాబ్రీ- రామ మందిర విషయంపై తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్‌లల్లాకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే అదే సమయంలో మసీదు నిర్మాణం కోసం.. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేసి.. ఆ తర్వాత మందిర నిర్మాణ పనులను ప్రారంభించింది.  రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్న విషయం తెలిసిన పాక్.. తన అక్కసు వెళ్లగక్కింది.

వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణం చేపడుతోందని.. భారత్‌లో ముస్లింల పట్ల వివక్ష కొనసాగుతుందంటూ విషం చిమ్మడం ప్రారంభించింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ బుధవారం నాడు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రార్థనా స్థలంలో మందిర నిర్మాణం చేపడుతున్నారని.. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామంటూ పాక్‌ పేర్కొంది. కరోనాతో పోరాడుతున్న సమయంలో.. ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలు దేశంలో హిందుత్వ అజెండాను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయంటూ ఆరోపించింది.

అయితే పాక్‌ చేసిన ఈ ప్రకటనలను దేశంలోని హిందూ సంఘాలు తిప్పికొట్టాయి. విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. గత డెబ్బై ఏళ్లలో పాక్‌లో మైనార్టీల సంఖ్య ఎక్కడి నుంచి ఎక్క్డడికి వచ్చిందో ఊహించుకుంటే.. మీకే తెలుస్తుందని.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందూ, క్రైస్తవ, సిక్కు మతస్థులపై జరుగుతున్న దాడుల గురించి చెప్పాలని.. భారత్‌లో మైనార్టీలంతా సురక్షితంగా ఉన్నారని పాక్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

Latest Articles
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..