East Godavari: రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు.. కట్ చేస్తే మాములు ట్విస్ట్ కాదు…

దొంగలు అప్ డేట్ అయ్యారు.. దొంగలు అప్ డేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా... ఎక్కడైనా ఇళ్ళు ,షాపులు, గుళ్లల్లో దొంగతనాలు చేస్తారు. అయితే ఒక చోట ఆక్వా...

East Godavari: రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు.. కట్ చేస్తే మాములు ట్విస్ట్ కాదు...
Shrimp Theft
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 8:35 PM

దొంగలు అప్ డేట్ అయ్యారు.. దొంగలు అప్ డేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా… ఎక్కడైనా ఇళ్ళు ,షాపులు, గుళ్లల్లో దొంగతనాలు చేస్తారు. అయితే ఒక చోట ఆక్వా చెరువులో రొయ్యలు దొంగతనం చేసారు.. ఇది ఎక్కడ సుమి అనుకుంటున్నారా..? అయితే ఫుల్ డిటేల్స్ వివరిస్తాం పదండి. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు నామాలవారి పాలెంలో విచిత్ర దొంగతనం జరిగింది. అమలాపురం రూరల్ జనుపల్లికి చెందిన నల్లా రామ్మూర్తి, గొర్తి విశ్వేశ్వర వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కి చెందిన ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువులో అర్దరాత్రి దొంగలు పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా రొయ్యలను పట్టుకుని ఆటోలో ఎస్కేప్ అయ్యేందుకు సిద్దమయ్యారు దుండగులు. అది గమనించిన పోలీసులు వారిని వెంబడించించారు. అమలాపురం రూరల్ మండలం బండారులంక వద్ద అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే. ఆక్వా చెరువు కాపలాదారుడే దొంగతనంలో అసలు సూత్రదారిగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితులపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పోలీసు ఇంట్లో చోరీ.. కట్ చేస్తే…

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీసు ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి నగలు, వస్తువులు ఎత్తుకెళ్లాడు  దొంగ. కానీ పోతూ పోతూ తనను క్షమించమంటూ ఓ లెటర్ రాసి వెళ్లాడు.  భిండ్ సిటీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ కమలేశ్ కటారే కుటుంబం భిండ్‌లో నివాసం ఉంటోంది. అయితే జూన్ 30న కమలేశ్ భార్య, అతడి పిల్లలు ఓ కజిన్ ఇంట్లో పెండ్లి ఉంటే వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి ఇంటికి రాగా లోపలి గది తాళాలు పగలిపోయి ఉండడం గమనించారు. బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులోని గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి వస్తువులు లేవని కమలేశ్ భార్య గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇళ్లంతా గాలించి, క్లూస్ సేకరిస్తుండగా దొంగ రాసిన లెటర్ తారసపడింది. ‘‘సారీ ఫ్రెండ్, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది. నేను ఈ పని చేయకపోతే నా స్నేహితుడి  ప్రాణం పోతుంది. ఓ నిండు ప్రాణం కాపాడడానికి ఈ దొంగతనం చేశాను” అని అందులో రాసి ఉంది. అయితే భయం అక్కర్లేదని, డబ్బు రాగానే తిరిగి ఇచ్చేస్తానని ఆ దొంగ అందులో రాయడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: ఇంటి వెనుక పెరట్లో ముత్యాలు పండిస్తున్న రైతు.. ఏకంగా లక్షలు అర్జిస్తున్నాడు..

 తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోన్న పిడుగులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు