AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TPCC new chief: టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అనుమతి లేకున్నా ర్యాలీ తీసినందుకు రేవంత్ రెడ్డి..

TPCC new chief: టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు
Revanth Reddy
Venkata Narayana
|

Updated on: Jul 08, 2021 | 7:56 PM

Share

Revanth Reddy: తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అనుమతి లేకున్నా ర్యాలీ తీసినందుకు రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్   కింద ఒక కేసు నమోదు అయ్యింది.. అలాగే బేగంబజార్‌లో రేవంత్‌పై పోలీసులు మరోకేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి నిన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు.

తర్వాత భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకుని టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో జరిగిన చట్ట ఉల్లంఘనలపై పోలీసులు ఈ కేసులు కట్టారు. అయితే రేవంత్ రెడ్డిపై కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. కావాలనే కేసులు ఫైల్ చేశారని విమర్శిస్తున్నారు.

ఇలాఉండగా, నిన్న తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్‌రెడ్డి. గాంధీభవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు పండితులు రేవంత్‌ను ఆశీర్వదించారు. పదవీ బాధ్యతల కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, సీనియర్‌ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్యయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read also: Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు