Nityananda: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులు

నిత్యానందకు (Nityananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి ఈ వారెంట్ ఇచ్చారు. బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు...

Nityananda: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్.. సెషన్స్ కోర్టు ఉత్తర్వులు
Nityananda
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 20, 2022 | 7:12 AM

నిత్యానందకు (Nityananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి ఈ వారెంట్ ఇచ్చారు. బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే వారెంట్ జారీ చేశారు. అయితే ఆయన ఆచూకీని మాత్రం పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని కోర్టు విచారించింది. నిత్యానంద హాజరు కాకపోవడంతో విచారణ నిలిచిపోయింది. ఈ క్రమంలో కేసు విచారణకు హాజరు కావాలంటూ 2019 నుంచి సమన్లు ఇస్తూనే ఉంది. తాజాగా ఇచ్చిన వారెంట్ ప్రకారం సెప్టెంబర్‌ 23 లోగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఫిర్యాదు ఆధారంగా ఆతనిపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన నిత్యానంద తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తర్వాత అతను దేశం నుంచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

కాగా.. దేశం నుంచి పారిపోయిన నిత్యానంద ‘కైలాస’ అనే స్వతంత్ర దేశాన్ని స్థాపించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కైలాస అనే ప్రదేశం ఎక్కడ ఉందన్న దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్వెడార్‌ సమీపంలో తాను ఓ చిన్న చిన్న దీవిని కొనుగోలు చేశానని, దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్‌ ఖండించింది. నిత్యానంద తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం నిత్యానంద చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నిత్యానంద.. తాను బతికే ఉన్నానని డాక్టర్లు చికిత్స చేస్తున్నారని వెల్లడించాడు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..