Fire Accident: సికింద్రాబాద్‌ బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది కార్మికుల సజీవ దహనం

Hyderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున మంటలు రాజుకున్నాయి.

Fire Accident:  సికింద్రాబాద్‌ బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది కార్మికుల సజీవ దహనం
Bhoiguda Fire Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 23, 2022 | 8:34 AM

Bhoiguda Fire Accident: తెల్లారకుండానే వారి జీవితాలు తెల్లారిపోయాయి. తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 12మందిలో 11మంది కాలిబూడిదయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డ మంటల్లో చూస్తుండగానే అంతకంతకు పెరిగాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు బయటకు రాలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 11 మంది విగతజీవులయ్యారు. ఒక్క కార్మికుడు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరొకరి కోసం రిస్య్కూ టీం సహాయక చర్యలు చేపడుతోంది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున మంటలు రాజుకున్నాయి. చక్కలకు మంటలు అంటుకుని అంతకంతకూ ఎగిసిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. 8 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ ఒకరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారిని బిట్టు(23), సికిందర్‌(40), దినేష్‌(35), దామోదర్(27), చింటు(17), సికిందర్(35), రాజేష్‌(25), రాజు(25), దీపక్(26), పంకజ్(26), గొల్లు(25)గా గుర్తించారు. ప్రేమ్,  అనే మరో ఇద్దరు యువకుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందతున్నారు.

ప్రమాద సమాచారం తెలియగానే హుటహుటిన.. ఘటనాస్థలానికి చేరుకున్నాయి 8 ఫైరింజన్లు. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపు చేశాయి. అయితే అప్పుటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మంటలను అదుపు చేయగల్గిన అగ్నిమాపక సిబ్బంది.. కార్మికుల ప్రాణాలను కాపాడలేకపోయామని సెంట్రల్ జోన్ పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో గోడౌన్‌లో 12 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా బీహార్‌ నుంచి వచ్చిన కూలీలు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అరా తీస్తున్నారు. ఫైర్‌ సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.గోడౌన్ లోపల కార్మికులు ఉన్నారన్న విషయం తెలియదు. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి చూస్తే మృతదేహాలు కనిపించాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. గోడౌన్ కప్పు కూలిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది

వారంతా పొట్ట చేతపట్టుకొని.. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో నగరానికి చేరుకున్నారు. తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. అయితే మంగళవారమే వారికి చివరి రోజైంది. రాత్రంతా పని చేసి.. తెల్లారక తమ గూడుకు చేరుకొని.. నిద్రపోతామనుకున్నారు. కాని గోడౌన్‌లోనే శాశ్వతంగా నిద్రపోయారు కార్మికులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. వారంతా గత నాలుగైదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గోడౌన్ యాజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?