AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదేం పనిరా నాయనా..! ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన కళాశాల కరస్పాండెంట్

ఆయన సమాజంలో ఓ పెద్దమనిషి. ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి. పది మందికి విద్యాబుద్ధులు చెప్పే ఉన్నతమైన వ్యక్తి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వయసు ఆరు పదులు దాటిన ఈయనలో యావ మాత్రం తగ్గలేదు. ఓ ఒంటరి మహిళను లైంగికంగా వేధించడం, నగ్నంగా వీడియో కాల్ చేయడం, అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడం, కోరిక తీర్చమని బ్రతిమాలడం ఈయనకు అలవాటై పోయింది.

Andhra Pradesh: ఇదేం పనిరా నాయనా..! ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన కళాశాల కరస్పాండెంట్
College Correspondent Harassment
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 24, 2024 | 3:50 PM

Share

ఆయన సమాజంలో ఓ పెద్దమనిషి. ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి. పది మందికి విద్యాబుద్ధులు చెప్పే ఉన్నతమైన వ్యక్తి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వయసు ఆరు పదులు దాటిన ఈయనలో యావ మాత్రం తగ్గలేదు. ఓ ఒంటరి మహిళను లైంగికంగా వేధించడం, నగ్నంగా వీడియో కాల్ చేయడం, అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడం, కోరిక తీర్చమని బ్రతిమాలడం ఈయనకు అలవాటై పోయింది. ఎవరూ లేని సమయంలో ఆ మహిళ ఇంటిలోకి చొరబడి అడ్డంగా బుక్కైన ఓ పెద్దమనిషి రాసలీలలు ఇవి.

బాధితురాలి కథనం మేరకు కడప జిల్లా రాజంపేట పట్టణంలో మోదుగుల కళావతమ్మ ఇంజనీరింగ్ కళాశాల (శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) వ్యవస్థాపకుడు పెంచలయ్య. దాదాపు 64 సంవత్సరాలు ఉంటుంది. ఈయన గత కొద్ది రోజులుగా రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్ లోనే షర్మిల అనే మహిళను వేధిస్తున్నట్లు ఆరోపించింది. తన కోరిక తీర్చాలంటూ తరచూ ఆమెను వేధిస్తున్నట్లు తెలిపింది. ఆమెకు ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, నగ్నంగా వీడియో కాల్ చేయడం, తన మాట వినాల్సిందిగా వేదింపులకు పాల్పడ్డాడు.

అయితే గత రెండు రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో పెంచలయ్య షర్మిల ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో ఖంగుతున్న షర్మిల పెంచలయ్యను ఇంట్లో బంధించి డయల్ 100కు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసింది. రాజంపేట పట్టణ పోలీసులు షర్మిల ఇంటిలో ఉన్న పెంచయ్యను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన ఇంటికి వచ్చిన బలవంతంగా అఘాయిత్యానికి యత్నించినట్లు షర్మిల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెంచలయ్య ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ ఆమె పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నగ్న వీడియో కాల్స్ చేసిన దృశ్యాలు, అసభ్యకర మెసేజ్‌లను ఆమె విడుదల చేసింది. తనకు న్యాయం చేయాలని ఆమె మీడియా ముందు ప్రాధేయపడింది. భర్త కిడ్నీ జబ్బుతో చనిపోయినా, పిల్లలను చదివించుకుంటూ ఒంటరిగా సమాజంలో బతుకుతున్న నాపై పెంచలయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. దీనిపై విచారించి పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

అప్పు చెల్లించలేదనే షర్మిల ఇంటికి వెళ్ళా- పెంచలయ్య

షర్మిలపై లైంగిక వేధింపులను ఖండించారు పెంచలయ్య. షర్మిల భవన నిర్మాణ రంగంలో మేస్త్రిగా ఉందని, కార్మికులను పంపిస్తానని ఆమె డబ్బులు తీసుకుని పంపించలేదని ఈ విషయమై ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లానని పెంచలయ్య పేర్కొన్నారు. ఉన్నట్టుండి ఎవరో కొందరు వ్యక్తులు తనను షర్మిల బెడ్రూంలోకి తోసేశారని ఈలోపు పోలీసులు వచ్చి తనని అదుపులోకి తీసుకున్నారని తన తప్పేమీ లేదంటున్నాడు పెంచలయ్య. తనను బెడ్ రూమ్‌లోకి తోచిన వ్యక్తులు ఎవరో వారిపై విచారణ జరపాలని ఆయన కోరారు. కొందరు భూ బకాసురులు కావాలనే తన ప్రతిష్ట దిగజార్చేందుకు ఇలా చేశారని ఆరోపించారు.

రాసలీలలకు రాజకీయ రంగు

విద్యా సంస్థల అధిపతి పెంచలయ్య ఒక పార్టీ సానుభూతిపరుడు గాను, ఒక సామాజిక వర్గంలో పెద్దమనిషి గా చలామణి అవుతుంటారు. షర్మిల ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కైన పెంచలయ్య.. తనపై కావాలనే  రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు పెంచలయ్య. కొందరు భూ బకాసురులే తనను షర్మిల ను అడ్డుపెట్టుకుని ట్రాప్ చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పెంచలయ్య రాసలీలలకు రాజకీయ రంగు పులమడం ప్రాధాన్యత సంచరించుకుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…