Black Magic: తంత్రం వేసి క్షుద్రపూజలు… వారు క్షణం ఆలస్యం చేసి ఉంటే పసిపాప కత్తికి బలైపోయేది

తమిళనాడులో జరిగిన ఓ క్షుద్రపూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్షణకాలం అలస్యం అయ్యి ఉంటే... ఓ పసిబిడ్డ ప్రాణం ఓ మూర్ఖుడి కత్తికి..

Black Magic: తంత్రం వేసి క్షుద్రపూజలు... వారు క్షణం ఆలస్యం చేసి ఉంటే పసిపాప కత్తికి బలైపోయేది
Black Magic
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2021 | 10:30 AM

తమిళనాడులో జరిగిన ఓ క్షుద్రపూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్షణకాలం అలస్యం అయ్యి ఉంటే… ఓ పసిబిడ్డ ప్రాణం ఓ మూర్ఖుడి కత్తికి నిలువునా బలైపోయేది. ఈలోపే గ్రామస్తులు కాస్త చొరవ తీసుకోవడంతో.. ఓ పాప బతికింది. ఓ దుర్మార్గుడి అత్యాశకు ఫుల్‌స్టాప్ పడింది. తమిళనాడులోని రాణిపేట, అరకోణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఊళ్లో ఉండే ఆశీర్వాదం అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. గుప్త నిధుల మీద ఆశపెట్టుకున్న అతను వాటి కోసం గాలించడం మొదలుపెట్టాడు. అలా వెళ్లిన వాడు.. ప్రతీ అమావాస్యకు మాత్రమే ఊళ్లోని తన సొంత ఇంటికి వచ్చేవాడు. వచ్చిన ప్రతీసారీ దాన్ని నీట్‌గా క్లీన్ చేసి ఏవేవో పూజలు చేసి మళ్లీ తెల్లవారే సరికి జంపయ్యేవాడు. గ్రామస్తులు కొన్ని అమావాస్యలపాటు ఈ తతంగాన్ని గమనించారు. అనుమానించారు. తాజాగా మొన్న సొంతూరు వచ్చాడు. వస్తూ వస్తూ అర్థరాత్రి టైమ్‌లో ఓ పాపను కారులో తీసుకొచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. గ్రామస్తులు మనకెందుకు అనుకోకుండా.. కాసేపటికి ఇంట్లో జరుగుతున్న తంతును గమనించారు. అంతే.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ చూశారు. ఏవో క్షుద్రపూజలు చేస్తున్నాడు ఆశీర్వాదం. అతనితోపాటు కర్నాటక నుంచి వచ్చిన ఇద్దరు స్వామీజీలూ ఈ తంత్రంలో పాల్గొన్నారు. కాసేపట్లో ఓ పాపను బలివ్వడానికి రెడీ అయినట్లుగా ఉందక్కడ దృశ్యం. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అందర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనలో గ్రామస్తులు మాకెందుకులే అనుకున్నా, ఎవరూ పరిస్థితిని గమనించకున్నా.. ఈ పాటికి ఓ నరబలి జరిగిపోయేది. ఓ పసిపాప ప్రాణం కత్తికి బలైపోయింది. ఇందులో గుప్త నిధులు, క్షుద్రపూజలు మాత్రమే కాదు.. అసలు ఆ పాప ఎవరు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఈ మొత్తం తంతు వెనుక ఉన్నదేంటన్న విషయాలు కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేటుగాళ్లను తమ మార్క్ స్టైల్లో విచారణ చేస్తున్న పోలీసులు.. కీలక సమాచారం సేకరిస్తున్నారు.

Also Read: వంకాయ, బీరకాయ కేజీ అర్ధరూపాయి.. టమాట 2 రూపాయలు.. కన్నీరు పెడుతున్న రైతులు

 కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు