ఓ మై గాడ్.. రోజుకు దేశంలో ఇన్ని రేప్‌లు జరుగుతున్నాయా..?

దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. పోలీసులు ఎన్ని ఎన్‌కౌంటర్‌లు చేసినా.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే.. అసలు రోజుకు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇంకా నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇక నిన్న దిశ, నేడు ఉన్నావ్ బాధితురాలు.. ఇలా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు […]

ఓ మై గాడ్.. రోజుకు దేశంలో ఇన్ని రేప్‌లు జరుగుతున్నాయా..?
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 4:05 AM

దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. పోలీసులు ఎన్ని ఎన్‌కౌంటర్‌లు చేసినా.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే.. అసలు రోజుకు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇంకా నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇక నిన్న దిశ, నేడు ఉన్నావ్ బాధితురాలు.. ఇలా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.

ఒంటరి మహిళలు కన్పిస్తే చాలు.. కామాంధులు..క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అత్యాచారం.. ఆ తర్వాత హత్య చేయడం, దహనం చేయడం.. ఇలా మహిళలను మట్టుబెడుతున్నారు. ఇక ఈ అత్యాచార ఘటనలు రోజు ఎన్ని జరుగుతున్నాయో తెలిస్తే షాక్ తినాల్సిందే. ఒక్క 2017 సంవత్సరంలోనే 32,500 రేప్ కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. అంటే దాదాపు రోజుకు 90కి పైగా రేప్‌ ఘటనలు జరుగుతున్నాయన్న మాట. అయితే ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా అనధికారిక లెక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదు. 2017లో మొత్తం 18,300 కేసుల్లో మాత్రమే జడ్జిమెంట్ వచ్చాయి. ఆ ఏడాది చివరి నాటికి మొత్తం 1,27,800 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.