ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి

ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. వెస్ట్ బెంగాల్‌కు అక్రమంగా తరలిస్తుండగా.. ఒడిషా క్రైం బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం..

ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 1:17 AM

ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. వెస్ట్ బెంగాల్‌కు అక్రమంగా తరలిస్తుండగా.. ఒడిషా క్రైం బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ సిబ్బంది తనిఖీలు చేప్టటారు. ఈ క్రమంలో కలహన్డి జిల్లాలోని దర్మాగర్‌ ప్రాంతంలో 120 కిలోల గంజాయిని గుర్తించారు. 181 ప్యాకిట్లలో ఈ గంజాయి ప్యాక్ చేసి ఉందని తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలకు పైగా ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని.. వారి వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా.. గంజాయి ప్యాకెట్లను వెస్ట్ బెంగాల్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్