మద్యం మత్తులో మున్సిపల్ అధికారులపై దౌర్జన్యం

మద్యం మత్తులో మున్సిపల్ అధికారులపై విరుచుకుపడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన ఓ వ్యక్తిని మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు..

  • Tv9 Telugu
  • Publish Date - 1:03 am, Fri, 21 August 20
మద్యం మత్తులో మున్సిపల్ అధికారులపై దౌర్జన్యం

మద్యం మత్తులో మున్సిపల్ అధికారులపై విరుచుకుపడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన ఓ వ్యక్తిని మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే..మండపేట 13వ వార్డుకు చెందిన యరమాటి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో మున్సిపల్ కార్యాలయం వద్ద నానా హంగామా చేశాడు.అవసరం లేకపోయినా లాక్ డౌన్ పెట్టారంటూ.. మున్సిపాలిటీ నుండి ఎవ్వరీనీ బయటకు వెళ్ళనీయనంటూ గేట్లు మూసేశాడు. అంతేకాదు.. అక్కడ ఉన్న వస్తువలను ధ్వంసం చేశాడు.ఈ ఘటనపై మున్సిపల్ కమీషనర్ త్రిపర్ల రామ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సిఐ అడపా నాగ మురళీ సిబ్బందితో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు.. ఆస్తులను ధ్వంసం చేసినందుకుగానూ సెక్షన్ 353, 427 ల కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్