AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Crime: వేధింపులు తాళలేక.. కొడుకును హత్యచేసిన తండ్రి.. కత్తితో దారుణంగా..

Son killed by Father: అందరిలానే ఆ తండ్రి.. కొడుకు గురించి కలలు కన్నాడు. కానీ కొడుకు వేధింపులు భరించలేక.. చివరకు కడతేర్చాడు. వేధింపులు తాళలేక తండ్రి..

TS Crime: వేధింపులు తాళలేక.. కొడుకును హత్యచేసిన తండ్రి.. కత్తితో దారుణంగా..
Murder
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2021 | 9:23 AM

Share

Son killed by Father: అందరిలానే ఆ తండ్రి.. కొడుకు గురించి కలలు కన్నాడు. కానీ కొడుకు వేధింపులు భరించలేక.. చివరకు కడతేర్చాడు. వేధింపులు తాళలేక తండ్రి.. సొంత కొడుకును హత్య చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రెండో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శివాజీనగర్‌ ప్రాంతానికి చెందిన ఏలుగం ప్రవీణ్‌ ప్రతి రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. తండ్రి రమేశ్‌ ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు. బుధవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చిన ప్రవీణ్‌.. తండ్రి రమేష్‌తో గొడవకు దిగాడు. దీంతో విసిగిపోయిన రమేశ్‌ అర్ధరాత్రి ప్రవీణ్‌ నిద్రిస్తున్న సమయంలో తలపై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రవీణ్ అక్కడిక్కడే మృతి చెందాడు.

అనంతరం రమేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. టౌన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్సై సాయినాథ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. అనంతరం ప్రవీణ్‌ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Andhra Pradesh: సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు పురగోతి.. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

Wife Murdered: శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్నవాడే కాళయముడయ్యాడు.. భార్యను వాహనంతో ఢీ కొట్టి హతమార్చిన భర్త