యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో ఆరుగురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే దుర్మరణం పాలయ్యారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Follow us

|

Updated on: Aug 26, 2020 | 12:19 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో ఆరుగురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే దుర్మరణం పాలయ్యారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ల‌క్నో-హ‌ర్దోయ్ ర‌హ‌దారిలో బుధ‌వారం ఉద‌యం ఈ ప్ర‌మాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, యూపీ రోడ్‌వేస్ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ల‌క్నో నుంచి హ‌ర్దోయ్‌కి వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌కు చెందిన బ‌స్సు హ‌ర్దోయ్ నుంచి ల‌క్నో వ‌స్తున్న మరో బస్సు ఢీకొన్నాయ‌ని లా అండ్ ఆర్డ‌ర్ జాయింట్ క‌మిష‌న‌ర్ న‌వీన్ ఆరోరా చెప్పారు. కాగా, ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. క్ష‌తగాత్రులు స‌రైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అక్క‌డి అధికారుల‌ను ఆదేశించారు.

అటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రోడ్‌వేస్ సైతం ఘ‌ట‌న‌పై స్పందించింది. ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు కోసం త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసి 24 గంట‌ల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. కాగా, బ‌స్సు డ్రైవ‌ర్ల మితిమీరిన వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఇదిలావుంటే, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, మృతుల ఎవ‌ర‌నేది ఇంకా గుర్తించాల్సి ఉంద‌ని తెలిపారు.