ఉద్యోగం పోయిందని డ్రైవర్ ఆత్మహత్య..

దేశ‌రాజ‌ధానిలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం పోయిందని ఓ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొందరు ఉద్యోగుల కుట్రతో ఉన్న ఉద్యోగం పోయింది. ఇతర ప్రాంతాల్లో ప‌నికోసం కాళ్ల‌రిగేలా తిరిగాడు. మూన్నెళ్లు గ‌డిచినా జాబ్ దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉద్యోగం పోయిందని డ్రైవర్ ఆత్మహత్య..
Balaraju Goud

|

Aug 26, 2020 | 10:15 AM

దేశ‌రాజ‌ధానిలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం పోయిందని ఓ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొందరు ఉద్యోగుల కుట్రతో ఉన్న ఉద్యోగం పోయింది. ఇతర ప్రాంతాల్లో ప‌నికోసం కాళ్ల‌రిగేలా తిరిగాడు. మూన్నెళ్లు గ‌డిచినా జాబ్ దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేశ‌రాజ‌ధానిలోని తిగ్రీ ప్రాంతంలోని జేజే క్యాంప్‌కు చెందిన‌ అజిత్ సింగ్ (40) డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. మూడు నెల‌ల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. అప్ప‌టి నుంచి ప‌నికోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. కరోనా ప్రభావంతో ఎక్క‌డా నౌకరి దొర‌క‌లేదు. మూడు నెలలు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో మంగ‌ళ‌వారం తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని త‌నువు చాలించాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. సుసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. త‌న‌ను కొంద‌రు తోటి ఉద్యోగులు కుట్ర పన్ని ఉద్యోగంలోంచి తీసివేయించార‌ని లేఖలో పేర్కొన్నారు అజిత్. త‌న చావుకు వాళ్లే కార‌ణ‌మ‌ని అందులో వెల్లడించాడు. పోలీసులు అజిత్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. 174వ సెక్ష‌న్ కింద‌ కేసు నమోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. అజిత్ సింగ్‌కు న‌లుగురు పిల్ల‌లు ఉన్నారు. అత‌ని భార్య రెండేండ్ల కిత్రం టీబీతో మ‌ర‌ణించింది. ఇప్పుడు అత‌డూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టంతో ఆ చిన్నారులు అనాథ‌ల‌య్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu