AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో మరోసారి విజయసాయిరెడ్డికి పిలుపు… రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు

ఏపీ లిక్కర్‌ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్‌. ఏప్రిల్‌ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు...

Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో మరోసారి విజయసాయిరెడ్డికి పిలుపు... రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు
Vijayasai Reddy
K Sammaiah
|

Updated on: Jul 11, 2025 | 7:40 AM

Share

ఏపీ లిక్కర్‌ కేసులో మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పిలుపు వచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్‌. ఏప్రిల్‌ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని.. కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. సూత్రధారులు, పాత్రధారులు, బిగ్‌ బాస్‌ అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.ఇప్పుడు, రెండోసారి సిట్‌ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే, ఈసారి ఎలాంటి కీలక విషయాలు బయటపెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఏపీ మద్యం కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇద్దరు అనుచరులను ఇటీవల సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. లిక్కర్‌ కేసులో A35, A36గా ఉన్న బాలాజీకుమార్‌యాదవ్, యద్దాల నవీన్ అనే ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్‌ కేసు నమోదు తర్వాత ఇద్దరు పరారీలో ఉండడంతో సెల్‌ఫోన్‌ లిగ్నల్స్‌ ఆధారంగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇండోర్ నుంచి విజయవాడకు తరలించారు. లిక్కర్ అక్రమాల డబ్బు తరలింపులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు సిట్‌ అధికారులు భావిస్తున్నారు. దాంతో.. లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కు చేరింది. అదేసమయంలో ఎన్నికల టైమ్‌లో తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలించారని బాలాజీకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు.. ఇదే కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ACB కోర్టులో చుక్కెదురు అయింది. మోహిత్‌రెడ్డి ముందస్తు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని మోహిత్‌రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు చేసింది. ఈ క్రమంలోనే.. ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ పిటిషన్లను తిరష్కరించింది. ఇక.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్ తర్వాత మోహిత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తంగా.. ఒకవైపు దర్యాప్తు వేగవంతం.. అరెస్ట్‌లు.. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించడం.. మోహిత్‌రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం.. తాజాగా విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు పంపించడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.