AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు

గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లా తురకపాలెం వెళ్లే రోడ్డు పొదల్లో శవమై కనిపించాడు. అయితే అతన్ని ఎవరూ హత్య చేసి ఉంటారన్న అంశంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు
Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 10, 2025 | 7:21 PM

Share

గుంటూరు నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లా తురకపాలెం వెళ్లే రోడ్డు పొదల్లో శవమై కనిపించాడు. అయితే అతన్ని ఎవరూ హత్య చేసి ఉంటారన్న అంశంపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. స్థంభాల గరువుకు చెందిన కరిముల్లాకు వివాహం అయింది. అయితే మద్యం తాగి జులాయిగా తిరుగుతుండటంతో భార్య అలిగి వెళ్లిపోయింది. అయితే ఆమె తమ పుట్టింటికి వెళ్లకుండా కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్లి కాపురానికి రమ్మని అడిగానా ఆమె రాలేదు. అయితే ఈ క్రమంలో కరిముల్లా వదినకు స్థంభాల గరువుకు చెందిన శివరామరాజుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు కరిముల్లా గుర్తించాడు.

అంతేకాకుండా తన భార్య కూడా వెళ్లి వదిన వద్దే ఉండటంతో అతని భార్య ప్రవర్తనపై కూడా కరిముల్లాకి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని పసిగట్టిన శివరామరాజు కరిముల్లా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. కరిముల్లాకి ఉన్న మద్యం వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని హత్య చేయాలని అనుకున్నాడు. వెంటనే శివరామరాజు స్నేహితుడైన మధుసూధన రెడ్డిని సంప్రదించాడు.

డబ్బు ఆశ చూపి కరిముల్లా అడ్డు తొలగించాలన్నాడు. దీంతో రంగంలోకి దిగిన మధుసూధన్ రెడ్డి గత పదిహేను రోజులుగా కరిముల్లాతో స్నేహం చేసి మద్యం పోయించేవాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండటంతో కరిముల్లా మధుసూధన్ రెడ్డితో పాటు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్దమయ్యాడు. రెండు రోజుల క్రితం మద్యం సేవించడానికి తురకపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన మధుసూధన్ రెడ్డి.. అక్కడే కరిముల్లా గొంతు కోసి హత్య చేసి పొదల్లోకి నెట్టేసి వచ్చాడు.

అయితే పోలీసులు మధుసూధన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా శివరామరాజు అంశంపై తెరపైకి వచ్చింది. మొదట తనకేమి తెలియదని శివరామరాజు బుకాయించిన మధుసూధన్ రెడ్డి ఇచ్చిన ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..