AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: హమ్మయ్య ఎండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీకి చల్లటి వార్త

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

AP Weather: హమ్మయ్య ఎండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీకి చల్లటి వార్త
Weather Report
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2026 | 5:49 PM

Share

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము నుండి, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమ లో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో పెద్దగా మార్పు లేదు. రాయలసీమలో ఆదివారం వేడి, తేమ తో కూడిన అసౌకర్యమైన వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది.

Also Read: ఏపీలో ‘అడవి ఆవులు’ నిజంగా ఉన్నాయా..? అవి ఎక్కడి నుంచి వచ్చాయి.. 

Follow Us