Watch: ఆదివాసి ఫ్యామిలీతో ఎలుగుబంటి ఆత్మీయ అనుబంధం.. జూకు వెళ్లినని చిన్న పిల్లాడిలా మారాం
అల్లూరి ఏజెన్సీలో ఓ ఎలుగుబంటి పెంపుడు జంతువుగా మారింది. ఆవులు, గేదెలు వలే అది కూడా గిరిజనుడితో కలిసిపోయింది. ఓ ఫ్యామీలో కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. అడవిలోకి వెళ్లినా.. ఇంటికీ తిరిగొచ్చినా అనుక్షణం వారితో ఉంటోంది. అయితే వనంలో ఉండాల్సిన వన్యమృగం జనాల్లో ఉంటే చట్టం ఊరుకుంటుందా? రెస్క్యూ చేసి అడవీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఎలుగుపిల్ల చేసిన బేల అరుపులు, ఆ గిరిజన కుటుంబం ఆవేదన అందరి హృదయాలను కదిలించింది. ఇంతకీ ఆ బేబీ బేర్ కూ, గిరిజన కుటుంబానికి ఉన్న అనుబంధమేంటి? తెలుసుకుందాం పదండి.

అల్లూరి జిల్లా అరకులోయ మండలం దొర వలస గ్రామానికి చెందిన కన్నయ్య అనే రైతు నివాసం ఉంటున్నాడు. రోజూలానే కాఫీతోటలో పనిచేసేందుకు వెళ్లిన కన్నయ్యకు ఓ రోజూ ఓ ఎలుగు బంటి తన పిల్లలతో పాటు కనిపించింది. అయితే దాడి చేస్తుందేమో భయంతో.. దాన్ని అడవుల్లోకి తరిమే ప్రయత్నం చేశాడు. అరుపులు కేకలు పెట్టి ఎలుగుబంటి మళ్లీ అడవుల్లోకి వెళ్లగొట్టేందుకు ట్రై చేశాడు.దీంతో ఆ ఎలుగుబండి తన పిల్లలో అడవిలోకి పరిగెత్తింది.అయితే మొత్తం ఐదు పిల్లలు ఉండగా నాలుగు మాత్రమే తల్లివెంట వెళ్లాయి.. ఒక బుజ్జి ఎలుగు పిల్ల మాత్రం.. తల్లి నుంచి వేరైంది. తల్లి కూడా ఈ పిల్లని విడిచిపెట్టిన విషయాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయింది. దీంతో తల్లి కోసం బేలగా చూస్తున్న ఆ పిల్ల ఎలుగు ప్రవర్తన కన్నయ్య మనసును కదిలించింది. దాన్ని తీసుకొచ్చి సపర్యాలు చేసి పెంపుడు జంతువుగా పెంచుకోవడం స్టార్ చేశాడు.
అప్పటినుంచి ఆ పిల్ల ఎలుగుబంటి కన్నయ్యతో అనుబంధం పెంచుకుంది. ఆ గిరిజన కుటుంబంతో దాని బంధం పెరిగింది. దీంతో కన్నయ్య అడవిలోకి వెళ్ళినప్పుడల్లా అతను వెంటే వెళ్ళేది ఈ పిల్ల ఎలుగుబంటి. ఇంటికి తనతోనే తిరిగి మళ్ళీ వచ్చేది. కన్నయ్య పెట్టిన ఆహారం తిని.. వారి ఇంట్లోనే ఉండిపోయేది. జనావాసాల కంటే అడవిలోనే ఉండడం ఆ ఎలుగుకు మంచిదని భావించిన కన్నయ్య.. పలుమార్లు తీసుకువెళ్లి అడవిలో విడిచిపెట్టాడు. అయినా అది మళ్లీ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేది.. ఇలా ఎన్నిసార్లు విడిచిపెట్టినా సరే.. మళ్లీ కన్నయ్యను వెతుక్కుంటూ ఆ ఇంటికి చేరుకునేది ఆ ఎలుగుబంటి. దీంతో ఆ ఎలుగుబంటి చూపిస్తున్న ప్రేమ విశ్వాసంతో దానితో ఆ కుటుంబానికి అనుబంధం మరింత పెరిగిపోయింది.
ఇలా ఎనిమిది నెలలు గడిచింది. ఆ ఎలుగుబంటి ఆ గ్రామంలోని అందరి నేస్తమైంది. అయితే కొందరు ఎలుగుబంటితో ఆడుకుంటున్న వీడియోలనో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం అటవీశాఖ అధికారులకు దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు. చట్టంపై అవగాహన లేకుండా తమతోపాటు క్రూరమృగాన్ని ఉంచుకున్నందుకు సదురు కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కన్నయ్య నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఎలుగుబంటిని జనావాసాల నుంచి రెస్క్యూ చేశారు. ప్రత్యేక బోనులో పెట్టి వాహనంలో విశాఖ జూకు తరలించారు. అడవి జంతువు ఏ సమయంలోనైనా తన సహజ స్వభావాన్ని ప్రదర్శిస్తుందని.. జనావాసాల్లో ఉండడం మంచిది కాదని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు సూచించారు.
అయితే అటవీశాఖ అధికారులు ఆ కుటుంబం నుంచి బేబీ బీర్‌ను తీసుకెళ్తున్న కనిపించిన దృశ్యాలు అందరి మనుసును కలిచివేశాయి. అధికారులు దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బేబి బీర్ అరచి గోల చేసింది.. అధికారులతో వెళ్లేందు తీవ్రంగా మారం చేసింది. తమ నుంచి దూరమవుతున్న ఆ బేబీ బీఆర్‌ను చూసి ఆ కుటుంబం కూడా కంట తడి పెట్టింది. ఆ దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. చట్టం నిబంధనలు తెలియక ఆ ఎలుగు పిల్లతో బంధాన్ని పెంచుకొన్న గిరిజన కుటుంబం ఇప్పుడు తల్లడిల్లుతోంది. దాన్ని తన పెంచామని.. ఇంట్లో ఒకరిగా చూసుకున్నామని సదురు కుంటుంబ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అయితే.. ఎక్కడున్నా సరే ఎలుగు క్షేమంగా ఉంటే చాలని కుటుంబ సభ్యులు అంటున్నారు. కచ్చితంగా ఎలుగును చూసేందుకు అయినా.. విశాఖ జూకు వెళ్తామంటున్నారు. జంతువులకు ఉండే విశ్వాసం మనుషులపై అవి చూపే అపరమైన ప్రేమ గురించి ఎన్నో కథలు వింటుంటాం. కుక్కపిల్లలు పిల్లలు వంటి పెంపుడు జంతువుల విశ్వాసం గురించి చర్చించుకుంటాము. కానీ క్రూర మృగాల జీవితాల్లో ఉండే అడవి జంతువులు సైతం మనసులతో విడదీయాలని బంధాన్ని పెంచుకుంటాయని నిరూపించే ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
