AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unwanted Record: రోహిత్ శర్మ చెత్త రికార్డులో చేరిన అభిషేక్ శర్మ.. అదేంటంటే?

Abhishek Sharma Unwanted Record: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ అవమానకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో డకౌట్ కావడంతో, ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సరసన నిలిచాడు.

Venkata Chari
|

Updated on: Apr 05, 2026 | 6:00 PM

Share
టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అద్భుతమైన ప్రణాళికతో వారిని దెబ్బతీశాడు.

1 / 5
ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆరో బంతికే షమీ వేసిన 'స్లోయర్' డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మణిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ పట్టాడు. దీంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

2 / 5
ఈ డకౌట్‌తో అభిషేక్ శర్మ ఒకే క్యాలెండర్ ఇయర్ (2026)లో ఆరోసారి సున్నాకే అవుట్ అయ్యాడు. గతంలో 2018లో రోహిత్ శర్మ, 2024లో సంజు శాంసన్ కూడా ఒకే ఏడాదిలో ఆరు సార్లు డకౌట్ అయ్యారు. ఇప్పుడు అభిషేక్ కూడా వారి సరసన చేరి అభిమానులను నిరాశపరిచాడు. అంతేకాకుండా, సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ (9), భువనేశ్వర్ కుమార్ (5) తర్వాత 4 డకౌట్లతో అభిషేక్ మూడో స్థానానికి చేరుకున్నాడు.

3 / 5
షమీ ధాటికి అభిషేక్ మాత్రమే కాదు, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా త్వరగానే వెనుదిరిగాడు. షమీ వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే హెడ్ కూడా అవుట్ కావడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ 31 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఆడుతున్న హైదరాబాద్ జట్టుకు షమీ తన అనుభవంతో కోలుకోలేని దెబ్బ తీశాడు.

4 / 5
టీ20లలో ఓపెనర్‌గా అత్యధికంగా డక్ ఔట్ అయిన టీమిండియా ప్లేయర్ల లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం.. 17 - రోహిత్ శర్మ, 16 - అజింక్య రహానే, 15 - గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, 14 - అభిషేక్ శర్మ*, 13 - పృథ్వీ షా, పార్థివ్ పటేల్ ఉన్నారు.

5 / 5
Follow Us
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్ 'కరుప్పు'

వావ్ ఉమెన్స్ క్రికెట్.. అన్ని లక్షల టిక్కెట్లు సోల్డ్ ఔట్

రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల

‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!

మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..

ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!

ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!

ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..

అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?