AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet 2026 Registration: పాలీసెట్‌కు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మరో 4 రోజుల్లో ముగుస్తున్న గడువు

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో 2026-27 సంవత్సరానికి గానూ ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9, 2026వ తేదీ వరకు..

AP Polycet 2026 Registration: పాలీసెట్‌కు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మరో 4 రోజుల్లో ముగుస్తున్న గడువు
AP Polycet Registration last date
Srilakshmi C
|

Updated on: Apr 05, 2026 | 6:20 PM

Share

అమరావతి, ఏప్రిల్‌ 5: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో 2026-27 సంవత్సరానికి గానూ ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించే పాలిసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణత పొందిన వారితోపాటు మార్చి/ ఏప్రిల్‌ 2026లో పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. కెరీర్‌లో త్వరగా సెటిల్‌ అవ్వాలనుకునే వారికి పాలీసెట్‌ మంచి అవకాశం. ఇతర వివరాలకు ఈ కింది డైరెక్ట్ లింక్‌పై క్లిక్‌ చేయండి.

ఏపీ పాలిసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us