AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష..

సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్‌ అరెస్టులు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు.

నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష..
Anusha Suicide Case
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2025 | 4:42 PM

Share

సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్‌ అరెస్టులు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ఓ మహిళను సైబర్‌ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా కంచు స్తంభంపాలెం వాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్న బాబుతో ఐదేళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్‌ KPHBలోని తులసీనగర్లో నివాసం ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కట్టింది. దీంతో ఆమెకు తిరిగి మరికొంత డబ్బు వచ్చినట్టు యాప్‌లో చూపించారు.

యాప్‌లో డబ్బులు కనిపిస్తున్నా ఖాతాలోకి బదిలీ అవ్వలేదు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూషతన దగ్గర ఉన్న బంగారం అమ్మి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది.

పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. అయితే సైబర్ నేరగాళ్లు స్పదించలేదు. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. కుమారుడిని పడుకోబెట్టి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనూష లేఖ రాసింది. తనలా టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసింది.

బంగారంతో పాటు లక్ష నగదు కూడా పోగొట్టుకున్న అనూష.. అత్తింటివారు తిడతారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.. గాంధీ ఆస్పత్రిలో అనూష మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు KPHB పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..