TS Crime News: తప్పిన భారీ ప్రమాదం.. ప్రజ్ఞాపూర్‌లో ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ.. 20 మందికి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 06, 2021 | 7:37 AM

Siddipet Accident: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌

TS Crime News: తప్పిన భారీ ప్రమాదం.. ప్రజ్ఞాపూర్‌లో ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ.. 20 మందికి..
Siddipet Accident

Siddipet Accident: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. జిల్లాలోని గజ్వేల్ మండలంలోని ప్రజ్ఞాపూర్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ కొన్నాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో.. బస్సులో ఉన్న దాదాపు 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే క్షతగాత్రులను గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4 గంటలకు వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రాజీవ్ రహదారి నుంచి జగదేవపూర్ వైపు మళ్లీస్తున్న కంటైనర్‌ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Crime News: అమ్మా ఉద్యోగంతో తిరిగొస్తాం.. ఇవే చివరి మాటలయ్యాయి.. తీరా ఆ ఐదుగురు స్నేహితులు..

Rowdy Sheeters : తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu