School van catches fire :స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవ దహనం

School van catches fire : పంజాబ్​లోని సంగ్రూర్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లంగోవల్ సిద్ సమాచార్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ మినీ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 8 మంది పిల్లలను స్థానికులు అద్దాలు పగలగొట్టి రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది పిల్లలు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరూ కూడా 10 నుంచి 12 ఏళ్ల వయసువారే కావడం మరింత బాధించే […]

School van catches fire :స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవ దహనం
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2020 | 7:06 PM

School van catches fire : పంజాబ్​లోని సంగ్రూర్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లంగోవల్ సిద్ సమాచార్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ మినీ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 8 మంది పిల్లలను స్థానికులు అద్దాలు పగలగొట్టి రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది పిల్లలు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరూ కూడా 10 నుంచి 12 ఏళ్ల వయసువారే కావడం మరింత బాధించే విషయం. అయితే అగ్నికీలలు ఎగిసిపడగానే డ్రైవర్ డోర్ తీసేందుకు విఫలయత్నం చేసినప్పటికి..అది లాక్ అయిపోవడం వల్ల చిన్నారుల ప్రాణాలు మంటలకు ఆహుతయ్యాయి. స్కూల్‌కి వెళ్లి తిరిగివస్తారనుకున్న పిల్లలు బూడిదగా మిగిలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్​ సింగ్ సింగ్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ..ప్రమాదంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.