ఢిల్లీలో “ఏటీఎం చోరీ”.. తీరు చూస్తే షాకింగ్.. ఇలా కూడా చేస్తారా..?
అరవై నాలుగు కళల్లో.. దొంగతనం కూడా ఓ కళ అంటారు కొందరు పెద్దలు. కొందరు హైటెక్ దొంగలు ప్రస్తుతం చేస్తున్న చోరీలు చూస్తే.. వీరికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అని అనుకోవాల్సిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏటీఎంను చోరి చేశారు దుండగులు. అయితే సాధారణంగా ఏటీఎం పగలగొట్టి.. అందులో ఉన్న డబ్బుతో ఉడాయించిన సంఘటనలు అనేకం. కానీ.. మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకుపోయిన ఘటనలు మాత్రం చాలా అరుదు. ఢిల్లీలోని తుగ్కాబాద్‌లో ఓ […]
అరవై నాలుగు కళల్లో.. దొంగతనం కూడా ఓ కళ అంటారు కొందరు పెద్దలు. కొందరు హైటెక్ దొంగలు ప్రస్తుతం చేస్తున్న చోరీలు చూస్తే.. వీరికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అని అనుకోవాల్సిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏటీఎంను చోరి చేశారు దుండగులు. అయితే సాధారణంగా ఏటీఎం పగలగొట్టి.. అందులో ఉన్న డబ్బుతో ఉడాయించిన సంఘటనలు అనేకం. కానీ.. మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకుపోయిన ఘటనలు మాత్రం చాలా అరుదు. ఢిల్లీలోని తుగ్కాబాద్‌లో ఓ ఏటీఎం శుక్రవారం చోరీకి గురైంది. అది కూడా అలా ఇలా వచ్చిన దొంగలు కాదు. ఏకంగా ఏటీఎం చోరి చేసేందుకు ఆ దుండగులు.. ఎస్‌యూవీ కారులో వచ్చి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎస్బీఐకి చెందిన ఓ ఏటీఎం మిషన్‌ని.. తాళ్లతో కట్టి.. వారు వచ్చిన ఎస్‌యూవీ కారుకు కట్టి ఈడ్చుకెళ్లారు.
అయితే అందులో ఉన్న డబ్బు మాత్రం కేవలం రూ.53,000/- ఉన్నాయని అధికారులు తెలిపారు. చోరి జరిగిన ఘటన.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే అందులో రికార్డైన విజువల్స్.. అస్పష్టంగా ఉండటంతో.. నిందితులను గుర్తించడం కాస్త ఇబ్బంది కల్గుతుందని అధికారులు తెలిపారు.