ఈ ఎన్నికల్లో కూడా.. “హై స్పీడ్”లో కారు.. కేటీఆర్ ట్వీట్..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధించింది. సొసైటీలకు జరిగిన ఈ పోరులో అధికార పార్టీ మద్దతుదారులకే ఆధిక్యత లభించింది. అత్యధిక సహకార సంఘాలను అన్ని పార్టీలు తమతమ ఖాతాల్లో వేసుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేద్దామనుకుని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి సక్సెస్ అయ్యింది. ఈ సారి జరిగిన ఈ సహకార సంస్థల ఎన్నికల్లో దాదాపు 90 శాతానికిపైగా టీఆర్ఎస్ […]
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధించింది. సొసైటీలకు జరిగిన ఈ పోరులో అధికార పార్టీ మద్దతుదారులకే ఆధిక్యత లభించింది. అత్యధిక సహకార సంఘాలను అన్ని పార్టీలు తమతమ ఖాతాల్లో వేసుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఎగిరేద్దామనుకుని పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి సక్సెస్ అయ్యింది. ఈ సారి జరిగిన ఈ సహకార సంస్థల ఎన్నికల్లో దాదాపు 90 శాతానికిపైగా టీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్ధలు విజయ కేతనం ఎగురవేశారు.
ఈ భారీ మెజార్టీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పీఏసీఎస్ ఎన్నికల్లో ఘన విజయం అందించిన రైతులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Heartfelt thanks to the farmers of Telangana for giving yet another resounding victory to @trspartyonline candidates in the primary agriculture cooperative societies’ election today ?
More than 90% societies won by TRS & along with 100% district DCCB/DCMS ?#TelanganaWithKCR
— KTR (@KTRTRS) February 15, 2020