అనంతలో ఏపీ మంత్రికి చేదు అనుభవం..!
ఏపీ మంత్రి శంకర్ నారాయణకు అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాట మార్చారని సోమందేపల్లిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో శంకర్ నారాయణ […]
ఏపీ మంత్రి శంకర్ నారాయణకు అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాట మార్చారని సోమందేపల్లిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో శంకర్ నారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌లను ఐటి శాఖ అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని అన్నారు. గత ఐదేళ్లలో మట్టి, ఇసుక, మద్యం, పోలవరం ద్వారా ఆర్జించిన అక్రమ సంపాదనను విదేశాలకు తరలించి వైట్ మనీగా మార్చి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ వద్ద 2వేల కోట్లు పట్టుబడడమే ఆయన చేసిన అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.