అమిత్ షాతో సీఎం జగన్ చర్చించిన కీలక అంశాలు ఇవే..!
మూడు రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటించారు. తొలిరోజు ప్రధాని మోదీని కలిసిన జగన్.. ఆ తర్వాత శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించిన అనంతరం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మండలి రద్దు సహా పలు అంశాలపై చర్చించారు. […]
మూడు రోజుల వ్యవధిలో ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటించారు. తొలిరోజు ప్రధాని మోదీని కలిసిన జగన్.. ఆ తర్వాత శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించిన అనంతరం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మండలి రద్దు సహా పలు అంశాలపై చర్చించారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు సీఎం జగన్. పోలవరం నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చులో 3 వేల 320 కోట్లు ఇప్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షాను కోరినట్లు సీఎం జగన్ చెప్పారు.
ఇక ప్రత్యేక హోదాపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్‌షాను కోరినట్లు సీఎం జగన్ వెల్లడించారు. కేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామన్న సీఎం.. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై న్యాయశాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. అటు మండలి రద్దు అంశాన్ని కూడా అమిత్‌షాకు వివరించారు. మండలి రద్దుకు కూడా కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు.