Hyderabad: ఆన్‌లైన్‌ వ్యభిచారానికి అడ్డాగా ఓయో రూమ్స్‌.. హైదరాబాద్‌లో వెలుగులోకి గలీజ్‌ దందా..

పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. యథేశ్చగా వ్యభిచారం దందాను సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నేరగాళ్లు వ్యభిచారానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆధునాతన సాంకేతికను ఉపయోగిస్తూ పోలీసులకు పట్టుబడకుండా వ్యభిచార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా...

Hyderabad: ఆన్‌లైన్‌ వ్యభిచారానికి అడ్డాగా ఓయో రూమ్స్‌.. హైదరాబాద్‌లో వెలుగులోకి గలీజ్‌ దందా..
Hitech Prostitution In Hyderabad
Follow us

|

Updated on: Feb 04, 2023 | 4:01 PM

పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. యథేశ్చగా వ్యభిచారం దందాను సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నేరగాళ్లు వ్యభిచారానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆధునాతన సాంకేతికను ఉపయోగిస్తూ పోలీసులకు పట్టుబడకుండా వ్యభిచార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సైబరాబాద్ పోలీసులు మరో ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నా ముఠాను పట్టుకున్నారు.

ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లొకాంటో, సొక్కా డాట్ ఇన్, బ్యాక్ పేజ్ వెబ్ సైట్లలో అమ్మాయిల ఫోటోలతో ఎరవేస్తూ వ్యభిచారాన్ని హైటెక్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇక పాత కస్టమర్లను టార్గెట్‌ చేసుకుంటూ.. వాట్సప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపుతున్నారు. ఈ హైటెక్‌ వ్యభిచారాన్ని పోలీసులు వల పన్ని గుట్టురట్టు చేశారు.

ఈ క్రమంలో మేకల అఖిల్ కుమార్, సురేష్ బోయిన అనే ఇద్దరు నిర్వాహకులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒయో రూమ్స్, హోటల్ రూమ్స్, అద్దెకు తీసుకున్న ఫ్లాట్స్ లో వ్యభిచారాన్ని సాగిస్తున్నారు కేటుగాళ్లు. వెస్ట్ బెంగాల్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరుకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 400 నుంచి 500 మందిని వ్యభిచారకూపం లోకి దింపినట్టు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..