శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో భారీ చోరీ.. రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ పోయిందంటూ ఫిర్యాదు..

జయవాడ జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో భారీ చోరీ జరిగింది. కంకిపాడు మండలం పునాదిపాడు క్యాంపస్ పరిధిలో వంద కోట్ల విలువైన సాఫ్ట వేర్ చోరి అయ్యిందని ఆ సంస్థ యాజమాన్యం..

శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో భారీ చోరీ.. రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ పోయిందంటూ ఫిర్యాదు..
Sri Chaitanya
Follow us
Sanjay Kasula

|

Updated on: May 29, 2021 | 10:54 PM

విజయవాడ జిల్లాలోని శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో భారీ చోరీ జరిగింది. కంకిపాడు మండలం పునాదిపాడు క్యాంపస్ పరిధిలో వంద కోట్ల విలువైన సాఫ్ట వేర్ చోరి అయ్యిందని ఆ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రస్తుత కళాశాల ఎజిఎం మురళీ కృష్ట కంకిపాడు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంకిపాడు పోలీసులు కధనం ప్రకారం… ఛైతన్య విద్యాసంస్ధల నిర్వహణ కోసం సుమారు రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ను యాజమాన్యం వినియోగిస్తోంది. మరెవరు తమ సమాచారం సేకరించకుండా అన్ని భద్రతలతో రూపొందించిన సాప్ట్ వేర్‌ను సంస్ధ కొనుగోలు చేసింది.

ఇందులో సంస్థలో చదువున్న విద్యార్థుల వివరాలు, వారు చెల్లించిన నగదుకు సంబంధించిన సమాచారం ఉన్నట్లుగా పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సంస్ధకు చెందిన సాప్ట్ వేర్ పని చేయకపోవటం, విధ్యార్ధుల వివరాలు, నగదుకు సంబంధించిన వివరాలలో సమగ్రత లోపించటంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు సంస్థలో పని చేస్తున్న సిబ్బంది అడిగినట్లుగా వారు పేర్కొన్నారు.

అయితే ఫిర్యాదులో మాత్రం కొందరిపై అనుమానాలు ఉన్నట్లుగా తెలిపారు. గతంలో కళశాలలో పనిచేసిన  ఎక్జిక్యూటివ్ డీన్ హోదాలో పనిచేసిన నరేంద్రబాబు, డీన్ శ్రీనివాసరావు, బాలకృష్ణ ప్రసాద్ లపై తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్ధులకు సంబంధించిన డేటాను సైతం దొంగిలించారిన వారు ఆరోపిస్తున్నారు.

ఈ డేటా ఆధారంగా పెనమలూరులో శ్రీ గోస లైట్స్ మెడికల్ అకాడమీ పేరిట మరొక విద్యాసంస్ధను ఏర్పాటు చేసుకుని తమ విద్యార్ధుల తల్లి దండ్రులకు ఫోన్లు చేస్తూ వారికి తక్కువ ఫీజులు తీసుకుంటామని చెబుతున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులే ఈ విషయాన్ని చైతన్యా విద్యాసంస్ధల దృష్టికి తీసుకు రావటంతో ఆందోళనకు గురైన యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి: PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!

Amazing Viral Video: గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో