Road Accident: రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఎంపీడీవో మృతి.. పలువురికి గాయాలు..!
Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా ఆదిశంకర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..
Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా ఆదిశంకర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో సూళ్లూరుపేట ఎంపీడీవో నర్మద మృతి చెందారు. ముందు వెళుతున్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, గూడూరు రూరల్ మండలంలోని ఆదిశంకర కళాశాల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఎంపీడీవోతో పాటు ఆమె భర్త, కొడుకు ఉన్నారు. వీరు నెల్లూరు నుండి సూళ్లూరుపేట వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.
కాగా, ఇలా ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, మద్యం సేవించి నడపడం, ఓవర్ టెక్, అతి వేగం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎంపీడీవో మృతితో మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి: