AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రాణం తీసిన గుంత.. ఆఫీస్‌కు వెళ్తుండగా.. బస్సు కిందపడి బైకర్‌ దుర్మరణం.. వీడియో

Chennai techie loses balance due to pothole: అతనొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఉదయాన్నే ఆఫీస్‌కు బయలుదేరాడు.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రోడ్డుపైనున్న గుంత అతనికి యమపాశంగా

Viral Video: ప్రాణం తీసిన గుంత.. ఆఫీస్‌కు వెళ్తుండగా.. బస్సు కిందపడి బైకర్‌ దుర్మరణం.. వీడియో
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2021 | 8:46 PM

Share

Chennai techie loses balance due to pothole: అతనొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఉదయాన్నే ఆఫీస్‌కు బయలుదేరాడు.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రోడ్డుపైనున్న గుంత అతనికి యమపాశంగా మారింది. బైక్ గుంతలో పడటంతో.. వాహనదారుడు బస్సు చక్రల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని 32 ఏళ్ల టెక్కీ మహమ్మద్ యూనస్ తన కార్యాలయానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ క్రమంలో బైక్‌ గుంతలో పడటంతో బస్సు కిందపడి మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో సోమవారం ఉదయం 8.44 గంటలకు ఈ ఘటన జరిగింది.

బైక్‌పై వెళుతుండగా.. బైక్‌ గుంతలో పడింది. దీంతో ఆ యువకుడు ద్విచక్ర వాహనంపై బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అప్పుడే ఎడమ వైపు వెళుతున్న సిటీ బస్సు కిందకు వాహనం దూసుకెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపసారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నా.. మరణించాడు. బస్సు చెన్నై బీసెంట్ నగర్ నుంచి చిన్నమలై మీదుగా వడపళని వెళ్తోందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గిండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

వైరల్ వీడియో.. 

ఈ ఘటన అనంతరం ప్రభుత్వ సిటీ బస్సు డ్రైవర్ దేవరాజును అరెస్టు చేశారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మహ్మద్ యూనస్ నంగనల్లూరు నివాసి కాగా.. అతను చెన్నైలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వర్షాల కారణంగా గుంత ఏర్పడినట్లు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కూడా కురుస్తోంది. ఈ ఘటన అనంతరం బైకర్‌ మృతికి కారణమైన గుంతను పూడ్చారు.

Also Read:

SBI Two Wheeler Loan: బైక్‌ కొనాలనుకుంటున్న వారికి ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీతో టూ-విలర్‌ లోన్‌ స్కీమ్‌..

IBPS 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. IBPS నుంచి నోటిఫికేషన్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..