Prakasam District: పెళ్లింట ఊహించని విషాదం.. మినీ ట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి
ఏపీలో ఇవాళ రెండు ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్ నుంచి జారిపడి నలుగురు మృతి...
ఏపీలో ఇవాళ రెండు ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్ నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. మినీ ట్రక్‌లో వెళ్తుండగా డోరు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం టైమ్‌లో వాహనంలో పదిమంది పెళ్లి బృందానికి చెందిన వారు ఉన్నారు. పొదిలి మండలం అక్క చెరువు నుంచి పెళ్లికి వధువు తీసుకుని వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు బంధువుల మరణం, మరోవైపు ప్రస్తుతానికి పెళ్లి ఆగిపోవడంతో ఇరు వైపులా కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివాహం జరిపించేందుకు వధువును సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
కాసేపట్లో పెళ్లి.. వేడుకకు అంతా సిద్ధం చేసుకుని వధువును పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు బయలుదేరారు. వధువుతో కలిసి మినీ ట్రక్‌లో వివాహ వేడుకకు వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ నుంచి ఒక్కసారిగా నలుగురు కింద పడిపోయారు. వాహనం వెనుక డోర్‌పై వీరు కూర్చున్నారు. ఆటోలో నుంచి జారిపడిన ఆ నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందారు. వధువు వాహనం ముందు భాగంలో కూర్చున్నందున ఆమెకు ప్రమాదం తప్పింది.
సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా మినీ ట్రక్‌లో నుంచి వ్యక్తులు జారిపడ్డారు. ఈ ఘటనతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులంతా ఈ వార్త విని కుప్పకూలిపోయారు. వివాహ వేడుక జరగాల్సిన ఆ ఇంట ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగిపోయింది. మృతులు కనకం కార్తీక్, అనిల్, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.
విశాఖ షీలానగర్ హైవేపై ప్రమాదం
మరోవైపు విశాఖగాజువాక షీలానగర్ హైవేపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతులు హేమంత్, ప్రసాద్‌గా గుర్తించారు.
Also Read: దేశవ్యాప్తంగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. నిరూపణ అయితే అనర్హత!