Crime News: బంగారం పేరుతో బురిడీ కొట్టించాడు.. రెవెన్యూ అధికారి వసూళ్ల పర్వంపై విచారణకు ఆదేశం..
తులం బంగారమిస్తే అద్దెలన్నీ మాఫీ చేయిస్తానంటూ ఓ రిటైర్డ్ రెవెన్యూ అధికారి దుకాణ దారులను బురిడీ కొట్టించాడు. వారిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశాడు
తులం బంగారమిస్తే అద్దెలన్నీ మాఫీ చేయిస్తానంటూ ఓ రిటైర్డ్ రెవెన్యూ అధికారి దుకాణ దారులను బురిడీ కొట్టించాడు. వారిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశాడు. అయితే ప్రస్తుతం కొత్త పాలక వర్గం వచ్చి మళ్లీ దుకాణ దారులను అద్దె వసూలు చేయమనడంతో ఆ రెవెన్యూ అధికారి మోసం బయటపడింది. కర్నూలు నగర పాలక సంస్థలో జరిగిన ఈ మోసంపై బాధితులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌తో పాటు డీఆర్వోలకు ఆదేశాలు అందాయి.
విచారణకు ఆదేశం.. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 429 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ. 6 లక్షల ఆదాయం నగరపాలక సంస్థకు అందుతోంది. అయితే దుకాణాల లీజు ముగియడంతో కొన్ని నెలల క్రితం రిజర్వేషన్ పద్ధతిలో మళ్లీ దుకాణాల కేటాయింపు చేశారు. వీటికి ఇంకా వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే ఓ రెవెన్యూ అధికారి (ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు) ఆయా దుకాణాలకు చెందిన అద్దె వసూళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. తులం బంగారం లేదా రూ. 40 వేలు ఇస్తే చెల్లించాల్సిన అద్దెల్లో 50 శాతం వరకు రాయితీ ఇస్తామని దుకాణ దారులను నమ్మించాడు. ఇతర అధికారులు మళ్లీ మీ జోలికి రాకుండా చూస్తామని వారి నుంచి భారీగా వసూళ్లు రాబట్టాడు. ప్రస్తుతం కొత్త పాలక వర్గం రావడంతో ఈ వసూళ్ల పర్వం బయటపడింది. ముఖ్యమంత్రి దాకా ఈ విషయం చేరడంతో రెవెన్యూ అధికారి చేతివాటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కర్నూల్ నగర పాలక సంస్థ డీకే బాలాజీకి ఆదేశాలు అందాయి.
Also Read: