AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిరోజు జైలులో రవిప్రకాష్..!

దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన రవిప్రకాష్.. చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. రవిప్రకాష్‌కు జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ 4412 కేటాయించి.. కృష్ణా బ్యారక్‌లో.. వైట్ కాలర్ బ్యారెక్స్‌లో ఉంచారు. మిగతా ఖైదీలతో పాటు రవిప్రకాష్‌ను ఉంచిన జైలు అధికారులు. ఏసీబీ కేసులో నిందితులతో కలిసి ఉన్న రవిప్రకాష్. ఎవరితోనూ రాత్రంతా.. […]

తొలిరోజు జైలులో రవిప్రకాష్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 5:17 PM

Share

దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో అరెస్ట్ అయిన రవిప్రకాష్.. చంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. రవిప్రకాష్‌కు జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ 4412 కేటాయించి.. కృష్ణా బ్యారక్‌లో.. వైట్ కాలర్ బ్యారెక్స్‌లో ఉంచారు. మిగతా ఖైదీలతో పాటు రవిప్రకాష్‌ను ఉంచిన జైలు అధికారులు. ఏసీబీ కేసులో నిందితులతో కలిసి ఉన్న రవిప్రకాష్. ఎవరితోనూ రాత్రంతా.. మట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం. ఈరోజు ఉదయం అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా.. సగం తిని వదిలేసినట్టు తెలుస్తోంది.

కాగా.. రవి ప్రకాష్ నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిలో రూ.18కోట్ల మేర నిధులను డైరక్టర్లకు తెలియకుండా దారి మళ్లించినట్లు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవి ప్రకాశ్, మూర్తి కలిసి సుమారు రూ.18 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేసినట్లు యాజమాన్యం గుర్తించింది. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. టీడీఎస్ పోగా.. రూ.11.74 కోట్లు విత్ డ్రా చేసినట్లు రికార్డుల్లో తేలింది. రవి ప్రకాష్‌పై సెక్షన్ 409,420,418 కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు.

రవిప్రకాష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని.. డీసీపీ సుమతి తెలిపారు. కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా.. చాలా అవకతవకలకు పాల్పడ్డారని.. ఈకేసుపై దర్యాప్తు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

Follow Us