ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త.. భార్య ఏం చేసిందంటే..

రెండో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని ఓ వ్యక్తి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

  • Balaraju Goud
  • Publish Date - 12:03 am, Wed, 29 July 20
ట్రిపుల్ తలాఖ్ చెప్పిన భర్త.. భార్య ఏం చేసిందంటే..

మహిళలను వేధించేవారి పట్ల ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ప్రయోజనం లేకుండాపోతోంది. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించినా.. భార్యతో తెగతెంపులు చేసేందుకు తలాక్‌ను ఆయుధంగా వాడేవారి సంఖ్య తగట్లేదు. తాజాగా రెండో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని ఓ వ్యక్తి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.  దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన బాధితురాలి భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. విషయం తెలిసిన భార్య, భర్తను నిలదీసింది. దీంతో ఆమెను నిందితుడు పెళ్లిచేసుకునేందుకు భార్య అనుమతినివ్వలేదని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.