ఒడిశా: ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పిన పూరీ – సూరత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. రాకపోకలకు అంతరాయం
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పి ఓ ఏనుగును ఢీకొట్టింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.....

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పి ఓ ఏనుగును ఢీకొట్టింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూరీ నుంచి సూరత్ వెళ్తున్న పూరీ-సూరత్ ఎక్స్ ప్రెస్ రైలు సంబల్‌పూర్ జిల్లా భవానీపల్లి వద్ద ఓ ఏనుగును ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్ నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
కాగా, ఇదే తరహ ప్రమాదంఈనెల 6న కూడా జరిగింది. రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఓ ఏనుగు మృతి చెందింది. భువనేశ్వర్ నుంచి రూర్కెలా వెళ్తున్న ట్రైన్ జుమురా సమీపంలోని గద్గబాగల్ వంతెన వద్ద ఏనుగును ఢీకొట్టింది. ఆ ఏనుగు వయసు 12 సంవత్సరాలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న సంభల్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్.. ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. రైలు ఒక్కసారిగా ఏనుగును ఢీకొట్టి పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.




